సంకల్ప దివాస్ ఫౌండేషన్ సెలెబ్రేషన్స్

సుచిరిండియా ఫౌండేషన్ ప్రతీ ఒక్కరు సమాజానికి తమవంతు బాధ్యతగా సేవచేయాలన్న లక్ష్యాన్ని తెలియజేస్తూ నవంబరు 28న సంకల్ప దివస్ సెలెబ్రేషన్స్ జరుగుతుంది.

ఈ సందర్భంగా సుచిరిండియా ఫౌండేషన్ అధినేత లయన్ వై.కిరణ్ ఒకరోజు పాటు జరిగే ఈ సంకల్ప దివస్ ద్వారా సామాన్య ప్రజలకు స్పూర్తి కలిగిస్తూనే కార్పొరేట్ సంస్థలు సమాజం లో అంతర్భాగమయెందుకు, ఇతరులు తమ సమయంలో సంపాదనలో కొంత వెచ్చసి తమనుతాము సమాజానికి పునరంకితం చేసుకునేందుకు స్ఫూర్తిని కలిగించేందుకు ప్రతి సంవత్సరం సంకల్ప దివస్ జరుపుతున్నామని అంతే కాకుండా కొన్ని ఆర్గనైజేషన్ వారి అవసరాల నిమిత్తం.. సొసైటీ వారికి స్కానర్, ప్రింటర్ మరియు సైకిల్, ఆత్మీయ మానసిక వికాస కేంద్రం వారికి కంప్యూటర్, కీర్తనా ఫౌండేషన్ వారికి కంప్యూటర్, నిర్మాన్ అసోసియేషన్ ఫర్ మెంటలి ఛాలెంజెడ్ వారికి మైక్రో ఒవేన్ మరియు శ్రీ మాతృ ప్రేమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్ వారికి వాషింగ్ మెషీన్ అందించారు.