Banner
banner
banner

బోల్డ్ నెస్ ను పునర్నిర్వచించిన పార్లే ఆగ్రో

‘బి బోల్డ్, బి బ్రేవ్’ అనేది పార్లే ఆగ్రో యొక్క ఉల్లాస భరిత మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ బి ఫిజ్ నినాదం. బి ఫిజ్ నూతన యాడ్ క్యాంపెయిన్ తో ఇది భారతదేశ బేవరేజ్ విభాగంలో కంపెనీ మరో సారి సంచలనం కలిగించింది. ఈ బ్రాండ్ నూతన ప్రచారకర్తగా అర్జున్ కపూర్ కనిపిస్తారు. కొత్త పానీయం – కొత్త ప్రచారకర్త ను తీసుకురావడం ద్వారా భయపడని, ధైర్యంగా ఉండే వాతావారణాన్ని బి ఫిజ్ తో పార్లే ఆగ్రో ఏర్పరిచి నట్లయింది.

గత ఏడాది మహమ్మారి ఉన్న కాలంలోనే బిఫిజ్ ఆవిష్కరించబడింది. ఇది పార్లే ఆగ్రో స్పార్క్లింగ్ ఫ్రూట్ డ్రింక్ విభాగానికి ఉద్వేగభరిత జోడింపు. ఇది అసాధారణ విజయం సాధించింది. సెకండరీ డేటా అధ్యయనం ప్రకారం, పెరిగిపోతున్న డిమాండ్ ప్రకారం, ఏడాది కాలంలోనే బి ఫిజ్ ఒక్కటే మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ విభాగం వృద్ధిని 10 రెట్లు చేయనుంది. అంతేగాకుండా, తన విశిష్ట రుచితో ఇది ఈ విభాగంలో సంచలనం సృష్టించింది. 160 మి.లీ. ధర రూ.10. పార్లే ఆగ్రో ఒక ఏడాదిలో సుమారుగా అర బిలియన్ యూనిట్లను విక్రయించింది. అంతేగాకుండా భారతదేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ గా నిలిచింది.

banner
Banner

ఈ సందర్భంగా పార్లే ఆగ్రో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఎంఓ నాడియా చౌహాన్ మాట్లాడుతూ, ‘‘గత ఏడాది కాలంలో బి ఫిజ్ ఎంతో వృద్ధి చెందింది. మా విక్రయాలను అనేక రెట్లు పెంచింది. ఇది స్పార్క్లింగ్ ఫ్రూట్ డ్రింక్ విభా గాన్ని విస్తరించడం మాత్రమే గాకుండా, మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ విభాగాన్ని అనేక రెట్లు పెంచింది. ఈ విభాగం భారత్ లో దాదాపుగా లేదనే చెప్పవచ్చు. మహమ్మారి కాలంలోనూ పోర్ట్ ఫోలియోను విజయవంతంగా విస్తరిం చడం అనేది మా ఆకాంక్షలకు, అంకితభావానికి నిదర్శనం. బి ఫిజ్ తో మేం మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ విభాగాన్ని నిర్మించాలనుకుంటున్నాం. అది మాత్రమే గాకుండా, 2030 నాటికి యాప్పీ ఫిజ్, బి ఫిజ్ సమ్మేళన శక్తితో స్పార్క్లింగ్ ఫ్రూట్ డ్రింక్ విభాగాన్ని 10,000 కోట్ల విభాగంగా చేద్దామని కూడా భావిస్తున్నాం’’ అని అన్నారు.

బి ఫిజ్ అనేది ధైర్యానికి సంబంధించిన డైనమిక్ డ్రింక్ గా చిత్రీకరించబడింది. నూతన అనుభూతులను,
సవాళ్ళను కోరుకునే వారి కోసం ఉద్దేశించింది. ఆకర్షణీయంగా ఎరుపు, తెలుపు రంగు ప్యాకేజింగ్ తో ఉంటుంది. దీని విశి ష్ట రుచి అన్ని వయస్సుల వినియోగదారులను ఆకట్టుకుంటుంది. రోజులో ఏ సమయంలోనైనా దీన్ని తాగవ చ్చు. దీపావళి అయినా, నూతన సంవత్సరాది అయినా లేదా ఇంట్లో జరిగే వేడుక అయినా పార్టీ – స్టారర్ గా బి ఫిజ్ ఉంటుంది. ఇది మిమ్మల్ని భయంలేని వారిగా చేస్తుంది, అంతేకాదు అనుభూతులను మసక బారనవిగా కూడా మిగులుస్తుంది. ఈ మాల్ట్ ఫ్లేవర్డ్ డ్రింక్ ఒక విశిష్ట రుచిని అందిస్తుంది. నాన్- ఆల్కహాలిక్ పానీయాలు కోరుకునే వారికి సరైన ఎంపికగా ఉంటుంది.

అర్జున్ కపూర్ ను ప్రచారకర్తగా నియమించడంపై నాడియా చౌహాన్ మాట్లాడుతూ, ‘‘‘ధైర్యం’, ‘ప్రత్యేకత’ లకు ప్రాతి నిథ్యం వహించేందుకు అర్జున్ కపూర్ చక్కటి ఎంపిక. ఈ బ్రాండ్ కు ప్రచారకర్తగా ఆయన మాతో ప్రయాణం
చేయడం మాకెంతో ఆనందదాయకం. అర్జున్ వ్యక్తిత్వానికి తగినట్లుగానే, బి ఫిజ్ కూడా ఇతరులతో పోల్చేందుకు వీల్లేని పటిష్ఠమైన విలక్షణ గుణాన్ని కలిగిఉంది. ఈ జంట ఈ బ్రాండ్ కు గొప్ప విజిబిలిటీని నిర్మిస్తారని, భారతదేశ వ్యాప్తంగా పానీయాల వినియోగదారులకు సులభమైన ఎంపికగా చేస్తారని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

పార్లే ఆగ్రోతో అనుబంధం గురించి  నటుడు అర్జున్ కపూర్ మాట్లాడుతూ, ‘‘ఒక విశిష్టమైన, ధైర్యవంతమైన,
విప్లవాత్మకమైన బి ఫిజ్ లాంటి పానీయానికి ప్రతినిథ్యం వహించడం నాకెంతో సంతోషాన్ని అందిస్తోంది. బ్రాండ్ ఆశ యాలు, మీ సొంత వ్యక్తిత్వం పరిపూర్ణంగా మమేకమయ్యే సందర్భాలు కొన్ని ఉంటాయి. బి ఫిజ్ తో నా అనుబంధం అలాంటిదే. ఈ ప్రకటన కోసం చేసిన షూటింగ్ ఒక గొప్ప అనుభూతిని అందించింది. అడ్వర్టయిజింగ్ పట్ల ఈ బ్రాండ్ అనుసరించిన ధోరణి అలాంటిది. బ్రాండ్ పట్ల పార్లే ఆగ్రో కు గల ఆశయంతో నేను పాలుపంచు కోవడం ఆనందంగా ఉంది. వారి వృద్ధి ప్రయాణంలో భాగమవుతూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

 Please find below the link to Parle Agro’s new B Fizz TVC:

పార్లే ఆగ్రో గురించి:

బేవరేజ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న పార్లే ఆగ్రో ప్రై.లి. అతిపెద్ద భారతీయ బేవరేజ్ కంపెనీ. దీని బ్రాండ్ టర్నోవర్ రూ.7000 కోట్లు. భారతీయ బేవరేజ్ మార్కెట్ చోదకశక్తిగా ఇది వినియోగదారులకు వివిధ రకాల ఉత్పాదనలను అందిస్తోంది. ఫ్రూట్ జ్యూస్ ఆధారిత పానీయాలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లాంటివి వివిధ వినియోగదారుల అ వసరాలను తీరుస్తున్నాయి. భారతదేశవ్యాప్తంగా, విదేశాల్లో 84 తయారీ కేంద్రాలతో, 5000 కు పైగా చానల్స్ భాగస్వాములతో పార్లే ఆగ్రో 1.9 మిలియన్ అవుట్ లెట్స్ కు సరఫరాలను అంది స్తోంది. ఫ్రూటీ, యాప్పీ, యాఫ్పీ ఫిజ్, బి ఫిజ్, స్మూద్, బెయిలీ, బెయిలీ సొడా ఫ్రియో, డిషూమ్, బాంబే 99లతో ఈ బ్రాండ్ వినూత్న తల శక్తిని విశ్వసిస్తోంది. వ్యూహాలకు, ప్రోడక్ట్ అభివృద్ధిలకు, వ్యాపార విధానాలకు కూడా అదే చోదకశక్తిగా ఉంటోంది. ఈ విశ్వాసమే పరిశ్రమను, వినియోగదారుల దృక్పథాలను మార్చిన ట్రెండ్స్ ను పార్లే ఆగ్రో రూపొందించేలా చేసింది.

, , , , , , , , , ,
Latest Posts from vyaparam.com
banner
banner
Banner