గెస్ట్స్ గాట్ టాలెంట్ సీజన్ -3 విజేతలను ప్రకటించిన నెఫ్రో ప్లస్

~భారతదేశవ్యాప్తంగా ఈ ఫ్లాగ్ షిప్ కార్యక్రమంలో పాల్గొన్న 250 మందికిపైగా డయాలిసిస్ రోగులు~

డయాలిసిస్ సంరక్షణను పునర్ నిర్వచించిన, భారతదేశవ్యాప్తంగా అతిపెద్ద డయాలి సిస్ సెంటర్ నెట్ వర్క్ అయిన నెఫ్రోప్లస్ తమ ఫ్లాగ్ షిప్ కార్యక్రమం అయిన ‘గెస్ట్స్ గాట్ టాలెంట్’ సీజన్ 3 విజేతలను ప్రకటించింది. గత 2 సీజన్ల అనంతరం సెప్టెంబర్ లో ఈ పోటీని ప్రకటించింది. డయాలిసిస్ రోగుల్లో ఉన్న సృజనాత్మకతను, ప్రతిభాపాటవాలను వెలుగులోకి తీసుకురావడం ఈ పోటీ ప్రధాన ఉద్దేశం.

ఈ సీజన్ లో ఈ పోటీలో దేశవ్యాప్తంగా 250 మందికి పైగా రోగులు పాల్గొన్నారు. గోవాకు చెందిన శ్రీ అగొస్టిన్హొ డా క్రుజ్ మొదటి బహుమతి గెలుపొందారు. గుజరత్ లోని హిమత్ నగర్ కు చెందిన శ్రీ అనికెత్ హితేంద్ర భా య్ రానా రెండో బహుమతి, ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన శ్రీ సుంకర రవీంద్ర కుమార్ మూడో బహు మతి గెలుపొందారు. ఈ ముగ్గురు విజేతలతో పాటుగా మరో ఐదుమందికి ప్రోత్సాహక బహుమతులను నెఫ్రో ప్లస్ అందించింది. 94.3 ఫీఎవర్ ఎఫ్ఎంపై అడ్డా 943 షో ను నిర్వహించే రేడియో జాకీ ఆర్జే యశ్ సృజ నాత్మకత, ప్రతిభ ఆధారంగా ఈ విజేతలను ఎంపిక చేశారు.

గెస్ట్ గాట్ టాలెంట్ – సీజన్ 3 సందర్భంగా నెఫ్రో ప్లస్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ విక్రమ్ ఉప్పాల మాట్లాడు తూ, ‘‘ఈ మహమ్మారి సమయంలోనూ ఎంతో ఉత్సాహంతో ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకెం తో ఆనందాన్ని అందిస్తోంది. విజేతలకు అభినందనలు. తమ సమయాన్ని వెచ్చించి, ఇందులో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ మా ధన్యవాదాలు. నెఫ్రో ప్లస్ జట్టు కఠోర కృషి కారణంగానే ఈ పోటీ నిర్వహణ సాధ్యపడింది. ఏటేటా ఇదే తరహా ఉత్సాహాన్ని మేం కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

గెస్ట్ గాట్ టాలెంట్ – సీజన్ 3 లో పాల్గొన్న వారి గురించి రేడియో జాకీ ఆర్జే యశ్ మాట్లాడుతూ, ‘‘ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో ఆనందదాయకం. ఈ రోగులంతా కూడా సంక్లిష్ట సమయాలను ఎదుర్కొం టున్నారు. అయినా కూడా ఎంతో ఆశావాద దృక్పథంతో ఉన్నారు. వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎం తో ఉంది. నెఫ్రోప్లస్ లాంటి కంపెనీలు వైద్యపరమైన అంశాలపై మాత్రమే గాకుండా డయాలిసిస్ రోగుల కోసం ఆ నందదాయక క్షణాలను రూపుదిద్దేందుకు ముందుకు రావడం హర్షణీయం’’ అని అన్నారు.

నెఫ్రో ప్లస్ గురించి:

నెఫ్రోప్లస్ భారతదేశంలో 20 రాష్ట్రాల్లో 132 నగరాల్లో 230 డయాలిసిస్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇది నాణ్యతపై దృష్టికి మరియు రోగి కేంద్రిత విధానానికి పేరొందింది. కంపెనీ 10 ఏళ్ల క్రితం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా డయాలిసిస్ రోగులు దీర్ఘకాలం సంతోషంతో మరియు ఉత్పాదకతతో జీవించేలా చేయలనేది సంస్థ ఆశయం. కంపెనీ ప్రతి నెలకు 20 వేలకు పైగా రోగులకు చికిత్స చేస్తోంది. ఇప్పటి వరకూ 52 లక్షలకు పైగా చికిత్సలు చేసింది.

For further information: https://www.nephroplus.com/