భద్రమైన/ సురక్షితమైన సేఫ్ నెట్వర్కింగ్ మరియు కొలాబొరేషన్స్ కోసం in:collab లాంఛ్‌ను ప్రకటించిన మల్టీ-వర్స్ టెక్నాలజీస్

In-Collab Final Logo

~సురక్షిత వాతావరణం అన్వేషణ, సృష్టి, కనెక్ట్, సమాచార మార్పిడి మరియు తోడ్పాటు కోసం నిర్మించిన పవర్-హౌస్ నెట్వర్క్ అప్లికేషన్~

మల్టీ-వర్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, భారీ ప్రమాణాలలో టెక్నాలజీ స్ట్యాక్స్, డేటా సెక్యూరిటీ మరియు ప్రైవసీలను వినియోగించడంలో నెక్ట్స్‌జెన్ టెక్నాలజీస్ యొక్క నైపుణ్యం మరియు పరిజ్ఞానం కలిగిన సంస్థ; ఇప్పుడు తమ తొలి సామాజిక ప్రయత్నంగా, in:collab లాంఛ్‌ను ప్రకటిస్తోంది. ఇప్పుడు పౌరులు, సంస్థలు మరియు ప్రభుత్వాలు… సురక్షితమైన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిపెటెడ్ సిస్టమ్ ద్వారా తెలుసుకోవడం, సృష్టించడం, కనెక్ట్ చేసుకోవడం, సమాచార మార్పిడి మరియు లావాదేవీలను నిర్వహించవచ్చు. ఏఐ మరియు కంప్యూటర్ విజన్ వంటి వివిధ ఆధునిక సాంకేతికతల నుంచి ఉపయోగ-సందర్భాలను సృష్టించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, మల్టీ-వర్స్ టెక్నాలజీస్, ఈరోజు సాధారణ డౌన్‌లోడ్ మరియు ఉపయోగం కోసం తమ బీటా-అప్లికేషన్‌ను రూపొందించింది. టెక్నాలజీ ప్రపంచంలో పౌరులు నియంత్రణ తీసుకోగలగడం, వికేంద్రీకృత పీర్-టు-పీర్ లేదా వ్యక్తి నుండి సమాజ సహకారాన్ని ప్రారంభించడం ద్వారా కీలకమైన వ్యక్తిగత సమాచారం మరియు డేటా ఉల్లంఘనలు; in:collab బహుళ సోషల్ మీడియా అప్లికేషన్స్ మధ్య లోపాలను తగ్గిస్తుంది.

వ్యక్తిగత భాగస్వామ్యం స్వచ్ఛందం కాగా… మాట్లాడే హక్కు, గోప్యత, భద్రత అంశాలపై మనకు నిరాకరించలేని డిజిటల్ హక్కులు ఉన్నాయి. సోషల్ మీడియా యొక్క సెంట్రలైజ్డ్ మరియు యాజమాన్య నిర్మాణాలతో డిజిటల్ సామ్రాజ్యాలు సృష్టించబడ్డాయి. పౌరులకు భద్రత మరియు గోప్యతలను ఎనేబుల్ చేయడానికి వీలుగా డిజైన్ చేయగా, సోషల్ మీడియాను in:collab డీసెంట్రలైజ్ చేస్తుంది. పౌరులు రూపొందించిన కంటెంట్‌కు సెంట్రలైజ్డ్ స్టోరేజ్ లేకుండా, వారి ప్రవర్తనలను విశ్లేషించడానికి మరియు ప్రభావం చూపేలా చేయడానికి అవకాశం లేదు. మరింతగా చెప్పాలంటే, అప్లికేషన్ సిస్టమ్‌ల యొక్క రక్షణను నిర్ధారించడానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సెక్యూరిటీ టెక్నాలజీ వెండర్స్ నుండి సమీకృత వనరులను in:collab సేకరిస్తుంది. అయితే, సెక్యూరిటీ విస్తృతి అనేది ఒక డైనమిక్. డిజిటల్ భద్రతను బలోపేతం చేయడానికి, మల్టీవర్స్ టెక్నాలజీస్ 24×7 కంటెంట్ & అప్లికేషన్ మానిటరింగ్ మరియు ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది, ఇది ఇప్పటికే భారతదేశంలోని అనేక సంస్థలను సమర్థవంతంగా, ప్రభావవంతంగా భద్రతను అందించింది.

ప్రపంచ పౌరులకు ఇంటర్నెట్ మాదిరిగానే సోషల్ మీడియా ఒక వరం. మనం అందరం వేర్వేరు వాతావరణాలలో విభిన్నంగా ప్రవర్తిస్తాము, తల్లి/తండ్రి, కొడుకు/కుమార్తె, స్నేహితుడు, విధులలో సహోద్యోగి… ఇలా మనం బహుళ వ్యక్తిత్వాలను ప్రదర్శిస్తాము, ఆయా పరిస్థితులలో మనకు సరైన అనుభూతి కలిగించేలా నడుచుకుంటాము. ఒకే సోషల్ మీడియా అప్లికేషన్‌లో పలు రకాల వేరు చేయబడిన వ్యక్తిత్వాలను in:collab అనుమతిస్తుంది. ఒకే ప్రాధమిక ఖాతా నుండి నిర్వహించబడే, షేర్ చేయబడిన సమాచారంపై వినియోగదారులకు పూర్తి నియంత్రణను నిర్ధారించడానికి ఇది అవాశం ఇస్తుంది. విభిన్న ఎంపిక చేసిన వ్యక్తులలో, ఒకే రకమైన ఆలోచన కలిగిన వ్యక్తులతో పెయిర్ కావడానికి ఈ అప్లికేషన్ అనుమతిని ఇస్తుంది. in:collab లో ‘పర్సోనా’ ఫీచర్ (పేటెంట్ పెండింగ్‌లో ఉంది) ప్రత్యేకమైనది. ఒకే ప్రామాణిత యూజర్‌కు బహుళ ప్రొఫైల్‌లను సృష్టించడానికి పౌరులకు ఇది సహాయపడుతుంది. ప్రతి పర్సోనా, ఈ నిర్దిష్ట సమూహాలకు సంబంధించిన కంటెంట్ మరియు కమ్యూనికేషన్‌ను పర్సనలైజ్ చేయడానికి పౌరులకు అనుమతిని ఇస్తుంది. సాధారణ ఉపయోగం కోసం పబ్లిక్ పర్సోనా, స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం పర్సనల్ పర్సోనాలు, విధులలో తోటివారి కోసం వర్క్ పర్సోనా, కమ్యూనిటీలు మరియు ఆసక్తి సమూహాల కోసం సర్కిల్స్ పర్సోనా, వ్యక్తిత్వంగా, స్థానిక వ్యాపారాలు మరియు దుకాణాలతో పరస్పర సంభాషలణ కోసం లైవ్-లోకల్ పర్సోనా, ఇది జియో-లోకల్ ప్రొఫైల్‌గా నిలుస్తుంది.  మేథస్సు(ఇంటెలిజెన్స్) కలిగిన యూజర్ ఇంటర్ఫేస్‌ను ఉపయోగించడం సులభం మరియు వీడియో, వాయిస్ డేటాను కలిగి ఉన్న మల్టీ-మీడియా సపోర్ట్‌తో ఇన్-యాప్ ఇంటిగ్రేషన్స్  ద్వారా పర్సోనాస్ మధ్య సురక్షితమైన డేటా షేరింగ్‌ సాధ్యం అవుతుంది.

పబ్లిక్ మరియు లైవ్-లోకల్, ఈ సర్కిల్స్‌తో.. భౌగోళిక ప్రాంతాలలో వ్యాపారాలు మరియు వ్యక్తుల సహకారాన్ని అనుమతిస్తుంది. లైవ్-లోకల్, సామీప్యత ఆధారంగా ఉండగా, ఇది అన్ని చిన్న మరియు స్థానిక వ్యాపారాలకు, ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌తో సమానంగా అవకాశాల ఆవిష్కరణకు వేదికను అందిస్తుంది. చర్చలు మరియు చర్యల కోసం అప్లికేషన్‌లో సమూహాలు మరియు సంఘాలు చురుకుగా పాల్గొనడానికి, కనుగొనటానికి మరియు సృష్టించడానికి సర్కిల్స్ పర్సోనా వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుత అనిశ్చిత మరియు సామాజికంగా దూరం పాటించాల్సిన సమయాల్లో ఇలాంటి ఆసక్తులను పంచుకునే మరియు స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇచ్చే వ్యక్తులతో వ్యక్తులను కలిపే ఆకర్షణీయమైన డిజిటల్ సపోర్ట్‌ను అందిస్తుంది.

పౌరులకు పూర్తి నియంత్రణ మరియు డేటా యొక్క గోప్యతను మరింతగా నిర్ధారించడానికి, ఉచిత డెడికేటెడ్ 256-బిట్ ఎన్‌క్రిపెటెడ్ పర్సనల్ స్టోరేజ్‌ను అందిస్తుంది- ఆసక్తికరమైన కంటెంట్ ఆర్కైవ్ చేయడానికి 5GB వాల్ట్, ముఖ్యమైన పత్రాలు, ఇన్‌వాయిస్‌లు, ఫోటోలు మరియు మరెన్నో యాక్సెస్ చేయడానికి యూజర్స్‌కు అనుమతి ఇస్తుంది. వర్క్ పర్సోనాలో అదనంగా InfiniteVault™ ను కలిగి ఉండగా దీనిలో -ఎండ్-టు-ఎండ్ బ్యాకప్‌లను పరికరాల్లో సింక్ చేయడానికి అనుమతిస్తుంది, ఇది సురక్షితమైన ఫైల్ సింక్ చేయడానికి, ఎంటర్‌ప్రైజ్‌లో తోటివారిలో ఎంత పరిమాణం అయినా షేర్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది.

రియల్ టైమ్ ఇన్‌ఫర్మేషన్‌తో ఇన్‌తో సిస్టమ్‌కు యాక్టివిటీ ఫీడ్స్ మరొక హైలైట్‌గా నిలుస్తాయి. ఇంటిగ్రేటెడ్ ఏఐ అల్గారిథమ్‌లను కూడా ఇది హోస్ట్ చేస్తుంది. త్వరలో దాని ప్రామాణికత మరియు సామాజిక ఆమోదయోగ్యత కోసం కంటెంట్‌ను ట్యాగ్ చేయడానికి ఫాక్ట్-చెకర్స్‌ కూడా దీనితో అందుబాటులోకి రానున్నాయి. స్వేచ్ఛావాదాన్ని అరికట్టకూడదనేది దీని లక్ష్యం, అయితే పౌరుల అవగాహనను నిర్ధారించడం కూడా చాలా అవసరం. మల్టీ-వర్స్ టెక్నాలజీస్ స్వయంగా ప్రచురించిన, ఉపయోగించిన కంటెంట్‌ను డొమైన్ల వ్యాప్తంగా కీలక నిపుణుల బోర్డు నియంత్రిస్తుంది. మైక్రో-యాప్స్ అని పిలువబడే తేలికపాటి, పరికర-సంబంధిత మరియు పని-నిర్దిష్ట సాధనాలు సిస్టమ్ అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఇప్పటికే ఉన్న & క్రొత్త అప్లికేషన్‌లను ఆధునీకరించడానికి ప్రత్యేకంగా దేనికది అభివృద్ధి చేయబడింది. అడాప్ట్ చేసుకోదగిన యూజర్ ఇంటర్ఫేస్ మరియు కస్టమర్-కేంద్రీకృత యూఎక్స్‌… సంస్థలకు, ప్రభుత్వాలకు కంటెంట్‌ను పంచుకునేందుకు మరియు వ్యక్తులతో నేరుగా సంపూర్ణ పద్ధతిలో నిమగ్నం కావడానికి, గరిష్ట సహకారాన్ని in:collab నిర్ధారిస్తుంది.

భారతదేశంలో 4.2 కోట్ల చిన్న వ్యాపారాలలో లైవ్-లోకల్ ఫీచర్ మరింతగా సాధికారతను తీసుకువస్తుంది. దేశంలోని మొత్తం 95 శాతం పారిశ్రామిక యూనిట్లు భారతదేశపు 40 శాతం మందికి ఉద్యోగులను అందిస్తున్నాయి. లైవ్-లోకల్ ఇప్పుడు ఈ యూనిట్లకు వారి స్వంత వాణిజ్యంతోపాటు, వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది. స్థానిక చిన్న వ్యాపారులు ఇప్పుడు తమ సొంత ఈకామర్స్ కలిగి ఉండవచ్చు, వినియోగదారులతో సన్నిహితంగా మెలగవచ్చు మరియు గ్లోబల్ ప్లాట్‌ఫామ్ మాదిరిగా వారికి సేవలను అందించవచ్చు.

ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి, సమాచారాని సురక్షితంగా నిల్వ చేయడానికి మరియు షేర్ చేసుకునేందుకు, చర్చలు, ఆలోచనలను ప్రోత్సహించడానికి, అభిరుచులను పెంపొందించడానికి, షాపింగ్ మరియు వాణిజ్యాన్ని సోషల్ మీడియా అవకాశం కల్పిస్తోంది. in:collab ప్రారంభించినప్పుడు, ఏ సోషల్ మీడియాలో అయినా పౌరులు దాదాపు అన్ని రకాల కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతినిస్తుంది. అలాగే, ముఖ్యంగా సోషల్ మీడియాను ప్రభావితం చేసిన మూడు సమస్యలను పరిష్కరిస్తుంది.

 1. నైతికపరమైన ఉద్దేశ్యం మాత్రమే కాకుండా, పౌరుల భద్రత మరియు గోప్యతా సమస్యలను నిర్మాణాత్మంకగా పరిష్కరించి, పర్సనల్ వాల్ట్‌లో కంటెంట్‌ను ఆర్కైవ్ చేస్తుంది. యూజర్లను విశ్లేషించే మరియు ప్రభావితం చేసే సామర్థ్యాన్ని తొలగిస్తుంది.
 2. పౌరులు బహుళ పర్సోనాలను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది మరియు వారి ఎంపికతో సృష్టించబడిన గ్రూప్‌లతో వేరు వేరు ఇంటరాక్షన్‌లకు అవకాశం ఇస్తుంది. మన నిజ జీవితం మాదిరిగాగనే, వర్చువల్ జీవితాన్ని గడపగలరు.
 3. డైరెక్ట్ పీర్-టు-పీర్ ట్రాన్సాక్షన్స్‌తో నేరుగా ఇంటరాక్ట్ అయ్యందుకు వ్యాపారులకు అవకాశం ఇచ్చి, వినియోగదారులకు విస్తృత ఎంపికను అందిస్తుంది మరియు వ్యక్తులకు సమీపంలో ఉండే చిన్న వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

సామాజిక పౌరులకు, సంస్థలకు మరియు ప్రభుత్వాలకు సురక్షితమైన ప్రత్యామ్నాయం In:Collab.

మల్టీవర్స్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు నెక్ట్స్‌జెన్ టెక్నాలజీస్ ఎండీ అడ్ సిఇఒ ఏ.ఎస్, రాజగోపాల్ గారు మాట్లాడుతూ “మనది సంక్లిష్టమైన మరియు ప్రత్యేకమైన వ్యక్తుల సమాజం. వ్యక్తులు వారి డిజిటల్ డేటాను నియంత్రించటానికి మరియు వ్యక్తిగత నిబంధనలపై కంటెంట్‌ను పంచుకునేందుకు, వినియోగించుకునేందుకు In:Collab నిర్మించబడింది. వ్యాపారాల భాగస్వామ్యాల సహకారాన్ని అనుమతించడానికి మరియు భాగస్వామ్య ఆసక్తులతో సమూహాలను నిర్మించడానికి ఇది ప్రోగ్రామ్ చేయబడింది, మరింత సమైక్య ఇంటరాక్షన్‌ను ప్రారంభించి, పూర్తి డేటా గోప్యతను నిర్ధారిస్తుంది. యూజర్ యొక్క అభీష్టానుసారం పర్సోనాలలో అంతటా కనిపించే సమాచారం ఉంటుంది. అలాగే ప్రామాణికమైన, బాధ్యతాయుతమైన జ్ఞానం వినియోగంపై ఫాక్ట్-చెకర్ ట్యాగ్ చేయబడిన కంటెంట్ బిల్డింగ్ ద్వారా ఫీడ్‌ల సమాచారాన్ని త్వరగా ధృవీకరించవచ్చు. డిజిటల్ ప్రపంచం అంతటా స్వేచ్ఛను విశ్వసించే సంస్థ, In:Collab, ప్రతీ అకౌంట్‌కు ఉచిత 256-బిట్ ఎన్‌క్రిప్టెడ్ 5GB స్టోరేజ్ వాల్ట్‌తో వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది, ఇది నిల్వ చేసిన డేటా యొక్క గోప్యత మరియు భద్రతను నిర్ధారించడానికి డీసెంట్రలైజ్ చేయబడి ఉంటుంది. ఈ సిస్టమ్ అప్లికేషన్‌తో, సహకారాలు, సమాచార భాగస్వామ్యం, సమాజ అభివృద్ధి మరియు ఇంటరాక్టివ్ చర్యల కోసం ఆన్‌లైన్‌లో సురక్షితమైన స్పేస్‌ను వ్యక్తులకు అందించడానికి  మేము ప్రయత్నిస్తున్నాము,” అన్నారు.

యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లేలలో వ్యక్తిగత డౌన్‌లోడ్ కోసం In:Collab అందుబాటులో ఉంది, అలాగే సంస్థలు మరియు వ్యాపారాల కోసం చక్కని నెట్‌వర్క్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఇక్కడ ప్లాన్‌ల వివరాలను యాక్సెస్ చేయవచ్చు మరియు కొనుగోలు చేయవచ్చు

iOS డౌన్‌లోడ్‌కు లింక్: https://apps.apple.com/in/app/in-collab/id1525364007

Android డౌన్‌లోడ్‌కు లింక్:

https://play.google.com/store/apps/details?id=com.multiverse.incollab

In:Collab అప్లికేషన్ హైలైట్స్

 • బహుళ ‘పర్సోనా’లతో ఒక అకౌంట్
 • డేటా స్టోరేజ్ కోసం ఉచిత 5GB డీసెంట్రలైజ్డ్ క్లౌడ్ వాల్ట్
 • తగినంత షేర్ చేయడానికి మరియు కంటెంట్ నాణ్యత కోసం మల్టీ-మీడియా సపోర్ట్
 • మైక్రో-యాప్స్‌ను స్వీకరించి, ఇంటిగ్రేట్ చేయగల సామర్థ్యం
 • సురక్షితమైన మరియు ఇబ్బందులు లేని వర్క్‌ప్లేస్ సహకారాల కోసం InfiniteVault™
 • జియో-లోకల్ వ్యాపారం మరియు కొనుగోలు అవకాశాల కోసం లైవ్-లోకల్
 • కమ్యూనిటీ గ్రూప్స్ ద్వారా కల్చర్ కల్టివేషన్
 • ఇంటిగ్రేటెడ్ Al ఎనేబుల్డ్ అల్గారిథమ్స్ మరియు ఫ్యాక్ట్ చెకర్స్ ద్వారా ట్యాగ్ చేయబడిన ప్రామాణికత మరియు సామాజిక ఆమోగ్య యోగ్యత గల వార్తలు, అప్‌డేట్‌లు
 • దీనిలో గ్రూప్‌ల ద్వారా సంస్థలు మరియు ప్రభుత్వాలను ప్రత్యక్షంగా చేరుకునే ఫంక్షన్ అందుబాటులో ఉంటుంది

మల్టీ-వర్స్ టెక్నాలజీస్ గురించి: ఏఐ, కంప్యూటర్ విజన్ వంటి ఇతర వివిధ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల నుండి యూజ్‌-కేసెస్‌లను సృష్టించే లక్ష్యంతో మల్టీ-వర్స్ టెక్నాలజీస్  స్థాపించబడింది. మల్టీవర్స్ అనేది నెక్ట్స్‌జెన్ టెక్నాలజీస్ యొక్క కస్టమర్, ఇది ఎంటర్‌ప్రైజ్‌లలో 1,000 మందికి పైగా కస్టమర్లు మరియు ప్రభుత్వం కోసం అనేక మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ అందిస్తుంది. అప్లికేషన్స్ పై దృష్టి కేంద్రీకరించిన ఈ సంస్థ, ముఖ్యంగా పౌరులు, సంస్థలు మరియు ప్రభుత్వాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విప్లవాత్మక వ్యవస్థ in:collabను విడుదల చేయడానికి లాంచ్‌ప్యాడ్, మల్టీవర్స్.