కోవిడ్ -19కి ఒక సంభావ్య చికిత్స రెమ్డిసివిర్ కోసం గిలీడ్ తో జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ లైసెన్సింగ్ ఒప్పందంలోకి ప్రవేశించింది.

తమ అనుబంధ సంస్థ, జూబిలంట్ జనరిక్స్ లిమిటెడ్ (‘జూబిలంట్’) గిలీడ్ సైన్సెస్ , ఇన్ కార్పొరేషన్ (ఎన్ఏఎస్ డీఏక్యూ: జీఎల్ డీ)తో ప్రత్యేకం కాని లైసెన్సింగ్ ఒప్పందంలోకి ప్రవేశించిందని ప్రకటించడానికి జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, ఒక సమీకృత అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ మరియు లైఫ్ సైన్సెస్ కంపెనీ ఆనందిస్తోంది. ఈ ఒప్పందం భారతదేశంతో సహా 127 దేశాలలో కోవిడ్ -19 కోసం ఒక సంభావ్య చికిత్సగా పేరు పొందిన గిలీడ్ వారి పరిశోధనాత్మక ఔషధం రెమ్ డిసివిర్ ని రిజిస్టర్ చేయడానికి, తయారీ చేయడానికి మరియు విక్రయించడానికి కావలసిన హక్కుని జూబిలంట్ కి ఇస్తుంది. ఆరోగ్య సంరక్షణ పొందడానికి ప్రధానమైన అడ్డంకులు ఎదుర్కొంటున్న పలు ఎగువ-మధ్య తరగతి మరియు ఉన్నత-ఆదాయం గల దేశాలతో పాటు, అల్పాదాయం మరియు అల్ప మధ్య-ఆదాయం గల దేశాలు కూడా ఈ దేశాలలో భాగంగా ఉన్నాయి. లైసెన్సింగ్ ఒప్పందం క్రింద, సంబంధిత దేశాలలో చట్టబద్ధమైన సంస్థలు ద్వారా ఆమోదాలు పొందిన తరువాత కోవిడ్ -19 రోగులకు మందు అందుబాటులో ఉండేలా చేయడానికి గాను ఉత్పత్తి పెంచడానికి గిలీడ్ తయారీ ప్రక్రియ యొక్క సాంకేతిక బదిలీని అందుకోవడానికి జూబిలంట్ కి హక్కు ఉంటుంది.

భాగస్వామం పై వ్యాఖ్యానం చేస్తూ, జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ శ్యాం ఎస్. భారతీయ మరియు సహ-ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ శ్రీ హరి ఎస్. భారతీయ ఇలా అన్నారు, ” అంతర్జాతీయంగా ఊహించని ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం కలిగించిన మహమ్మారి కోవిడ్ -19 కోసం ఒక సంభావ్య చికిత్సగా చూపించిన ప్రారంభపు డేటా ఆధారంగా రెమ్ డిసివిర్ కు లైసెన్స్ ఇవ్వడానికి గిలీడ్ తో మా భాగస్వామాన్ని శక్తివంతం చేసినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. మేము చట్టబద్ధమైన ఆమోదాలు మరియు క్లీనికల్ ట్రయల్స్ ని ఎంతో దగ్గరగా పరిశీలిస్తాము మరియు కావల్సిన చట్టబద్ధమైన ఆమోదాలు లభించిన తరువాత త్వరలోనే డ్రగ్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటాము. ఔషధం స్థిరంగా లభించడానికి మరియు దాని ఖర్చు ప్రభావానికి సహాయపడటానికి ఔషధం యొక్క యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (‘ఏపీఐ’) ని సంస్థలో ఉత్పత్తి చేయడానికి కూడా మేము ప్రణాళిక చేసాము. “

కోవిడ్ -19కి చికిత్స చేయడానికి గిలీడ్ అభివృద్ధి చేసిన, ఒక పరిశోధనాత్మక యాంటీ వైరల్ చికిత్స రెమ్ డిసివిర్ యుఎస్ ఎఫ్ డీఏ ద్వారా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ)ని అందుకుంది. కోవిడ్ -19 వ్యాధి తీవ్రంగా ఉండి ఆసుపత్రిలో చేరిన రోగులకు చికిత్స చేయడానికి రెమ్ డిసివిర్ ను విస్త్రతంగా ఉపయోగించడానికి ద ఈయూఏ సులభం చేస్తుంది. రెండు అంతర్జాతీయ క్లీనికల్ ట్రయల్స్ – కోవిడ్ -19 మధ్యస్థం నుండి తీవ్రమైన లక్షణాలతో ఉన్న రోగులలో యుఎస్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ప్లాసిబో -నియంత్రిత ఫేజ్ 3 అధ్యయనం మరియు వ్యాధి తీవ్రంగా ఉన్న రోగులలో రెమ్ డిసివిర్ ను మూల్యాంకనం చేసే గిలీడ్ వారి అంతర్జాతీయ ఫేజ్ 3 అధ్యయనం. కోవిడ్ -19 కోసం ఒక చికిత్సగా రెమ్ డిసివిర్ భద్రత మరియు సామర్థ్యం పై మరింత డేటాని ఉత్పన్నం చేయడానికి మరెన్నో అదనపు క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. రెమ్ డిసివిర్ ఒక పరిశోధనాత్మక ఔషధంగా ఉంది మరియు యుఎస్ ఎఫ్ డీఏచే ఆమోదించబడలేదు.

జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ గురించి:

జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ఒక సమీకృత అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ మరియు లైఫ్ సైన్సెస్ కంపెనీ. ఫార్మాస్యూటికల్స్ , లైఫ్ సైన్స్ ఇంగ్రీడియంట్స్ మరియు ఔషధం గుర్తింపు మరియు అభివృద్ధి పరిష్కారాల వ్యాపారాలలో కంపెనీ నిమగ్నమైంది. జూబిలంట్ ఫార్మా లిమిటెడ్ , సింగపూర్ ( జేపీఎల్) ద్వారా ఫార్మాస్యూటికల్ వ్యాపారం యూఎస్ లో 50కి పైగా రేడియో-ఫార్మాస్యూటికల్స్ నెట్ వర్క్ తో రేడియో ఫార్మాస్యూటికల్స్, అలెర్జీ థెరపీ ఉత్పత్తులు, స్టెరైల్ ఇంజెక్టిబుల్స్ మరియు నాన్-స్టెరైల్ ఉత్పత్తులు కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ , ఏపీఐలు, యుఎస్ లో ఆరు యూఎస్ ఎఫ్ డీఏ, కెనడా, భారతదేశం ఆమోదించిన తయారీ సదుపాయాలు ద్వారా మాత్రల సూత్రీకరణల తయారీ మరియు సరఫరాలో కంపెనీ నిమగ్నమైంది. ద లైఫ్ సైన్స్ ఇంగ్రీడియంట్ విభాగం భారతదేశంలో అయిదు తయారీ సదుపాయాలు ద్వారా ప్రత్యేకమైన మధ్యంతర విషయాలు , పోషకాహారం ఉత్పత్తులు మరియు లైఫ్ సైన్స్ కెమికల్స్ లో నిమగ్నమైంది. డ్రగ్ డిస్కవరి మరియు డవలప్ మెంట్ సొల్యూషన్స్ జూబిలంట్ బయోసిస్ లిమిటెడ్ మరియు జూబిలంట్ కెమ్ సిస్ లిమిటెడ్ ద్వారా డ్రగ్ డిస్కవరి సర్వీసెస్ ( డీడీఎస్) వ్యాపారాన్ని కలిగి ఉంది మరియు జూబిలంట్ థెరాపెటిక్స్ ద్వారా ప్రొప్రైటరి డ్రగ్ డిస్కవరి వ్యాపారాన్ని కలిగి ఉంది. భారతదేశంలో బెంగళూరు మరియు నోయిడాలలో రెండు ప్రపంచ స్థాయికి చెందిన తరగతుల ద్వారా డీడీఎస్ నవీన మరియు సహకార పరిశోధనను కేటాయిస్తుంది మరియు జూబిలంట్ థెరాపెటిక్స్ ఒక నవీన బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది అంకాలజీ మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధుల విభాగంలో సరికొత్త చికిత్సల్ని అభివృద్ధి చేస్తోంది. జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కు అంతర్జాతీయంగా సుమారు 8,000 బహుళ సంస్క్రతుల ప్రజల బృందం ఉంది మరియు 100కి పైగా దేశాలలో తమ కస్టమర్లకు విలువను అందచేయడానికి కట్టుబడింది. కంపెనీని అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ మరియు లైఫ్ సైన్సెస్ కంపెనీలు ‘పార్ట్ నర్ ఆఫ్ ఛాయిస్’ గా గుర్తించాయి. మరింత సమాచారం కోసం దయచేసి www.jubl.com. ని చూడండి.
ధ్యత లేదని వెల్లడింపు:

ఈ డాక్యుమెంట్ లో భవిష్యత్తు పరిస్థితి, కార్యక్రమాలు లేదా పరిస్థితులకు సంబంధించిన వ్యాఖ్యానాలు – వర్తమానం మరియు అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు పై భవిష్యత్తు అంచనాలు మరియు ఊహించిన ప్రభావాలు పై ఆధారపడిన ఊహించిన వ్యాఖ్యానాలుగా ప్రణాళికలు మరియు లక్ష్యాలు, పరిశోధన మరియు అభివృద్ధి యొక్క ప్రగతి మరియు పరిశోధన, సంభావ్య ఉత్పత్తి లక్షణాలు మరియు ఉపయోగాలు, ఉత్పత్తి అమ్మకాల సంభావ్యత మరియు ఉత్పత్తి ప్రారంభానికి లక్ష్యభరితంగా గల తేదీలు గురించి వ్యాఖ్యానాలతో సహా అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఉన్నవి. అలాంటి వ్యాఖ్యానాలు అసంఖ్యాకమైన ప్రమాదాలు మరియు అనిశ్చితలకు లోబడి ఉన్నాయి మరియు అవి తప్పనిసరిగా భవిష్యత్తు ఫలితాలను ఊహించాల్సిన అవసరం లేదు. అసలు ఫలితాలు ఊహించిన వ్యాఖ్యానాలలో ఆ ఊహించిన వ్యాఖ్యానాలకు మెటీరియల్ వారీగా వేరుగా ఉండవచ్చు. జూబిలంట్ సైన్సెస్ ఎప్పటికప్పుడు, అదనంగా లిఖితపూర్వకంగా మరియు మౌఖికంగా ఊహించిన వ్యాఖ్యానాలు చేస్తుంది, వీటిలో చట్టబద్ధమైన సంస్థలతో కంపెనీ దాఖలు చేసిన వ్యాఖ్యానాలు మరియు భాగస్వాములకు చేసిన నివేదనలు కూడా భాగంగా ఉంటాయి. అసలు ఫలితాలు, మారిన ఊహలు లేదా ఇతర అంశాలను ప్రతిబింబించే ఊహించిన వ్యాఖ్యానాలు నవీకరించడానికి కంపెనీకి ఎలాంటి బాధ్యత లేదు.
.