ITC లిమిటెడ్ యొక్క సన్‌ఫీస్ట్ YiPPee! ఇన్‌స్టంట్ నూడుల్స్ కేటగిరిలో ఓ కొత్త ఉత్పాదన తీసుకొచ్చింది, క్విక్ మీల్జ్ ద్వారా ప్రవేశపెడుతోంది ‘నూడిల్స్ ఇన్ ఎ బౌల్’

సన్‌ఫీస్ట్ YiPPee!, భారత దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ నూడిల్ బ్రాండ్స్‌లో ఒకటి.  ఇన్‌స్టంట్ నూడిల్స్ సెగ్మెంట్‌లో  మళ్లీ ఓ నూతన ఆవిష్కరణను తీసుకొచ్చింది. నూడిల్స్‌ను ఓ బౌల్‌లో అందించడం ద్వారా వినియోగదారులు ఓ సరికొత్త అనుభవాన్ని ఆస్వాదించేలా ప్రవేశపెడుతోంది క్విక్ మీల్జ్. ఈ సరికొత్త సమర్పణ/రూపంతో ఈ రంగంలో ఆహ్వానించదగిన మార్పుకు నాంది పలకనుంది. ఇక నుంచి వినియోగదారులకు ఇన్‌స్టంట్ నూడిల్స్ బౌల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు అత్యుత్తమ ఇన్‌స్టంట్ నూడిల్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో సన్‌ఫీస్ట్ YiPPee! లెక్కకు మించి చేసిన ప్రయత్నాల అనంతరం దీనిని తీసుకొచ్చింది. అడుగున వెడల్పుగా ఉండే కంటెయినర్‌తో బౌల్ ఫార్మాట్‌లో క్విక్ మీల్జ్‌ను ప్రవేశపెడుతోంది. దీనివల్ల నూడిల్స్‌ను కలుపుకోవడం మరియు తినడం చాలా సులువుగా ఉంటుంది. దీంతోపాటు పైన ఉండే మూత ద్వారా సిద్ధం చేసే క్రమంలో బౌల్ నుంచి వేడి బయటకు పోకుండా ఉంటుంది.  అంటే వండిన నూడిల్స్ కూడా ఏ మాత్రం చల్లారిపోవని భరోసా దొరుకుతుంది. అన్నింటికన్నా అత్యుత్తమమైన విషయం, నోరూరించే ఫ్లేవర్స్‌తో కూడి బాగా కలగలసిన మరియు ‘రుచికరమైన’ నూడిల్స్ ఓ బౌల్‌లో ఆస్వాదించగలగడం.

సన్‌ఫీస్ట్ YiPPee!’ యొక్క క్విక్ మీల్జ్ రేంజ్ మారుతున్న నేటి తరం యువ జనుల జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించబడింది. ఎవరైతే రుచిలో ఏ మాత్రం రాజీ పడకుండానే అనువుగా ఉండే పద్ధతుల కోసం అన్వేషిస్తుంటారో  వారి అవసరాలకు ఇది సరిగ్గా సరిపోయే విధంగా ఉంటుంది. ఇక నుంచి వినియోగదారులు సన్‌ఫీస్ట్ YiPPee!’ యొక్క పొడవుగా, జారుగా మరియు రుచిగా ఉండే విభిన్నమైన నూడిల్‌ను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా సులువుగా ఆస్వాదించవచ్చు. కేవలం బౌల్‌లో ఉండే నూడిల్స్‌కు కాస్త వేడి నీళ్లు కలపడం ద్వారా ఇది సిద్ధమైపోతుంది. ఎంతో వివేచనతో రూపొంచించి సమర్పిస్తున్న ఈ – సన్‌ఫీస్ట్ YiPPee! క్విక్ మీల్జ్ వెనుక వినియోగదారుల విస్తృత అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఎంతో పరిశోధన మరియు అభివృద్ధి దాగి ఉంది. ఇది వెజ్జీ డిలైట్ & చికెన్ డిలైట్ అనే రెండు విభిన్న రకాల్లో అందుబాటులో ఉంటుంది.

సంప్రదాయ ఇన్‌స్టంట్ నూడిల్స్ రంగంలో కొత్తదనం అవసరం క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఆశించిన దానికి మించి అందించాలనే ఉద్దేశ్యంతో YiPPee!ని 2010లో ప్రవేశపెట్టారు. వినియోగదారుల యొక్క నమ్మకం మరియు అభిమానం YiPPee! ఒక విశేషమైన స్థాయికి ఎదిగేందుకు సహాయపడ్డాయి. లెక్కల్లో చెప్పాలి అంటే దీని కోసం వినియోగిస్తున్న మొత్తం ప్రారంభించినప్పటి నుంచి మొదలుకొని ఈ రోజుకు దాదాపు రూ. 1300 కోట్ల విలువైన బ్రాండ్ స్థాయికి ఎదిగింది. మరింతగా పెరుగుతున్న వినియోగదారుల ఆదరణతో, YiPPee! దేశంలోనే రెండో అతిపెద్ద ఇన్‌స్టంట్ నూడిల్ బ్రాండ్‌ స్థాయికి చేరుకుని స్థిరంగా కొనసాగుతోంది. వినియోగదారుల డిమాండ్ ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో పెంచుకోవడంలోనూ YiPPee! ఘనత సాధించింది. ఇటీవల కాలంలో సాధిస్తున్న ఘన విజయాల బాటలోనే ప్రస్తుత సంవత్సరంలోనూ విశేషమైన పెరుగుదల కనిపిచింది.

ప్రారంభ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ITC అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘వినూత్నత మరియు వైవిధ్యత అనేవి  సన్‌ఫీస్ట్ YiPPee!’ యొక్క డీఎన్‌ఏలోనే ఉన్నాయి. ప్రారంభించినప్పటి నుంచి ఇవి మూలస్తంభాలుగా నిలిచాయి. అది పొడవుగా మరియు జారుగా ఉండే  మా గుండ్రటి బ్లాక్ నూడిల్ కావచ్చు లేక తాజాగా బౌల్ ఫార్మాట్‌లో ప్రవేశపెట్టిన క్విక్ మీల్జ్ కావచ్చు, వేటినైనా ఎంతగానో ఆస్వాదిస్తూ తింటారు. వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అందుకు కొనసాగింపుగా ప్రతి ఉత్పత్తిని ఎంతో వివేచనతో అభివృద్ధి చేసిన తరవాతనే అందుబాటులోకి తెస్తున్నాం.

ఇటీవల కాలంలో ఇన్‌స్టంట్ నూడిల్స్ వినియోగంలో అపూర్వమైన మార్పు కనిపిస్తోంది.  ఇంటి నుంచి పని చేయాల్సిన పరిస్థితుల కారణంగా వినియోగదారుల రోజువారీ జీవన శైలిలో ఎన్నో మార్పులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ సరికొత్త సాధారణ పరిస్థితుల్లో భాగంగా మారిపోయాయి. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా, వారు విభిన్నమైన, అత్యున్నతమైన రుచి & అనుకూలంగా ఉండే నమ్మదగిన ఆహార రకాల కోసం అన్వేషిస్తున్నారు. దాంతోపాటు భద్రత మరియు శుభ్రత కలిగి ఉంటాయనే విశ్వసనీయత కూడా ఆశిస్తున్నారు. క్విక్ మీల్జ్‌తో మళ్లీ మేము ఒక అపురూపమైన ఇన్‌స్టంట్ నూడిల్ అనుభవం అందించగలమని అత్యంత నమ్మకంతో ఉన్నాము. YiPPee! కుటుంబంలో మరొక సభ్యుడిని చేరుస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాం’’.

ఈ ప్రొడక్ట్ పెద్ద తరహా స్టోర్లతో పాటు ఆధునిక వర్తకం మరియు ఈ-కామర్స్‌తో సహా భారత దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. వెజ్జీ డిలైట్ & చికెన్ డిలైట్ రెండూ వరసగా రూ. 45 & రూ. 50 ధరల పాయింట్ వద్ద 70 గ్రాముల ఎస్‌కెయులో లభిస్తాయి.

ITC Foods గురించి: ITC లిమిటెడ్ యొక్క విభాగం

భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, ఫాబెల్, సన్‌బీన్, మరియు గమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ & కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ & బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం (HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది.

తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.