ఫ్రూట్ బెవరేజెస్‌లో, క్లినికల్‌గా నిరూపితమైన పదార్ధాలతో రూపొందిన రోగనిరోధక శక్తిని పెంపొందించే పానీయం విడుదల కోసం ITC యొక్క బీ న్యాచురల్ మరియు ఆమ్వే ఇండియా భాగస్వామ్యం

బీ న్యాచురల్+ రేంజ్ లాంఛ్ కోసం వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన రెండు పరిశ్రమ ప్రముఖ కంపెనీలు

జాతీయం: ప్రత్యేకమైన భాగస్వామ్యంలో భాగంగా, ITC యొక్క బీ న్యాచురల్ మరియు ఆమ్వే ఇండియా సంస్థలు భారతీయ వినియోగదారుల కోసం మొట్టమొదటిసారిగా ప్రత్యేక తరహా బీ న్యాచురల్+ రేంజ్‌ను లాంఛ్ చేయడం కోసం భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాయి. వినియోగదారులకు పండ్ల ద్వారా పోషణ ఇవ్వడంపై విశ్వసించే బీ న్యాచురల్ జ్యూసెస్ మరియు బెవరేజెస్, ఇప్పుడు బీ న్యాచురల్+ రేంజ్‌ను లాంఛ్ చేయడం ద్వారా వారికి రోగ నిరోధక శక్తి + పండ్ల మరియు ఫైబర్ అందించాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాయి.

ITC యొక్క లైఫ్ సైన్సెస్ & టెక్నాలజీ సెంటర్ (LSTC) ద్వారా అభివృద్ధి చేయబడిన, క్లినికల్‌గా నిరూపితమైన ప్రత్యేకమైన పదార్ధం అందించే రోగనిరోధక శక్తిని అందించడంపై ఇది వాగ్దానం చేస్తుంది. LSTC లో ITC యొక్క సైంటిస్టుల బృందం వివిధ రకాల ఆరోగ్య మరియు పోషకాల విభాగాలలో దాదాపు దశాబ్ద కాలంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో రోగనిరోధక శక్తి విభాగం ఎంతో కీలకంగా మారింది. ICMR ద్వారా జారీ చేయబడిన అన్ని రకాల నిబంధనలను దృష్టిలో ఉంచుకుని డబుల్-బ్లైండ్ ప్లాసీబో కంట్రోల్డ్ క్లినికల్ స్టడీని 3 నెలలకు పైగా, ఈ క్లినికల్‌గా నిరూపితమైన పదార్ధాన్ని వివిధరకాలుగా పరీక్షలు నిర్వహించారు మరియు ఈ అధ్యయనాన్ని CTRI వద్ద రిజిస్టర్ చేశారు.

కొత్త బీ న్యాచురల్+ రేంజ్ రెండు ప్రముఖ విభాగాలలో లభ్యం అవుతుంది – ఆరెంజ్ మరియు మిక్సెడ్ ఫ్రూట్.

కొత్త ఉత్పత్తి ఆలోచనను అభివృద్ధి చేయడంలో ITC యొక్క కృషిని ఆమ్వే ఎంతగానో ప్రోత్సహిస్తోంది. బీ న్యాచురల్+ రేంజ్‌ను త్వరగా వినియోగదారుల చెంతకు చేర్చేందుకు మరియు త్వరితంగా వినియోగాదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను పొందేందుకు విశ్వసనీయమైన మరియు నిపుణులైన భాగస్వామి ద్వారా విడుదల చేసే ఉద్దేశ్యంతో, ఈ రేంజ్‌ను ఆమ్వే ఇండియా ద్వారా లాంఛ్ చేశారు. ఆరోగ్యం మరియు ఇమ్యూనిటీ విభాగంలో వ్యూహాత్మక భాగస్వామిగా, ఈ ఉత్పత్తిని మరింతగా వినియోగదారుల చెంతకు చేర్చగలమని ఆమ్వే ఇండియా విశ్వసిస్తోంది. అదేవిధంగా, ఈ రేంజ్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఆధునిక వ్యాపార విధానం, సాధారణ వ్యాపార స్టోర్‌లు మరియు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లోను, ITC యొక్క దేశవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉండనుంది.

ఈ ప్రత్యేకమైన భాగస్వామ్యంపై ITC లిమిటెడ్, డివిజనల్ చీఫ్ – ఫుడ్స్ డివిజన్, శ్రీ హేమంత్ మాలిక్ మాట్లాడుతూ ఇలా తెలిపారు, “ITC వద్ద, భారతీయ వినియోగదారుల అవసరాలను తీర్చే విధంగా ప్రపంచ స్థాయి భారతీయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై మేము కట్టుబడి ఉన్నాము. ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య సంక్షోభం సమయంలో, పూర్తి కుటుంబం యొక్క రోగనిరోధక శక్తి కీలకమైన ప్రధానాంశంగా అవతరిచింది మరియు క్లినికల్‌గా నిరూపితమైన పదార్ధంతో రోగనిరోధక శక్తికి మద్దతు ఇచ్చే విధంగా ప్రభావవంతమైన ఫ్రూట్ బెవరేజ్ రేంజ్‌ను ఈ వేసవిలో అందించేందుకు బీ న్యాచురల్ సహజంగానే చొరవ తీసుకుని ముందడుగు వేసింది. మహమ్మారి వ్యాప్తి కాలంలో ITC యొక్క ఆవిష్కరణ వ్యవస్థ ఎంతగానో కృషి చేస్తోంది మరియు ITCలో మా సహోద్యోగుల అవిశ్రాంత కృషి ఫలితంగా ITC లైఫ్ సెన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ కేవలం రెండు నెలల అతి తక్కువ రికార్డ్ సమయంలోనే ఈ రేంజ్‌ను అభివృద్ధి చేయగలిగింది.”

ఆమ్వే ఇండియాతో భాగస్వామ్యాన్ని ప్రకటించడంపై మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యం మేము సంఘటితం కావడానికి ప్రతిబింబం, మా బృందాలు ఆరోగ్యం మరియు సంరక్షణ రంగంలో వివిధ కార్యక్రమాలపై దగ్గరగా పని చేస్తాయి. ఈ భాగస్వామ్యం మా వినియోగదారులకు మరియు సమాజానికి మరింత మెరుగైన సేవలందించడంలో అర్ధవంతమైన సహకారాన్ని అందించగలదని మేము విశ్వసిస్తున్నాము.”

ఆమ్వే ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ప్రై. లిమిటెడ్, సీఈఓ, శ్రీ అన్షు బుధ్రాజా ఈ ఎక్స్‌క్లూజివ్ భాగస్వామ్యంపై మాట్లాడుతూ ఇలా తెలిపారు, “విక్రయాలలో ప్రపంచ నెం. 1 విటమిన్స్ మరియు డైటరీ సప్లిమెంట్స్ బ్రాండ్‌గా, ఆరోగ్యంపై దృష్టి నిలిపేవారు ఎంచుకునే బ్రాండ్‌గా ఆమ్వే నిలుస్తోంది. మరియు 80 సంవత్సరాలకు పైగా మార్గదర్శకత్వం యొక్క ధృడమైన వారసత్వాన్ని కలిగి ఉంది, అలాగే సప్లిమెంట్ ఫుడ్ విభాగంలో మొక్కల ఆధారిత విధానాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తోంది. ప్రకృతి మరియు సైన్స్ నుంచి ఉత్తమంగా పొందిన వాటిని సమ్మిళితం చేస్తూ రూపొందించిన న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రొటీన్, రోగనిరోధక శక్తి నిర్మాణంలో పునాది వేసే పదార్ధంగా నిలుస్తోంది. ప్రస్తుతం రోగనిరోధక శక్తి పై అవగాహన విస్తృతంగా పెరిగిన పరిస్థితులలో, బీ న్యాచురల్ యొక్క + రేంజ్ ‌తో న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రొటీన్‌ను సమ్మిళితం చేయడం ద్వారా, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అత్యంత అనువైన అవకాశం అందించనుందని మేము విశ్వసిస్తున్నాము. అలాగే వినియోగదారులకు తాము అందించే ధరకు తగిన విలువను అందిస్తామని ఆశిస్తున్నాము.”

ప్రస్తుతం, మేము పైలటింగ్ మరియు టెస్టింగ్ చేసే దశలో ఉన్నాము మరియు వనరులను సమకూర్చుకుంటున్నాము, ఈ విజ్ఞాన ఆధారిత పరిశోధనపై భాగస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేసుకోనున్నాము. వినియోగదారులకు వారి రోజువారి భోజనం ద్వారానే మెరుగైన రోగనిరోధక శక్తి పెంపొందించే ఉత్పత్తులను అందించడం ద్వారా వారికి ఈ అంశంలో సహాయపడాలనే మా లక్ష్యానికి ITC లిమిటెడ్ యొక్క బీ న్యాచురల్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యం తొలి అడుగా చెప్పుకోవాలి, అందుకోసం కొత్త ఫ్రూట్ బెవరేజెస్ రేంజ్, దానితో పాటు న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రొటీన్, రోజువారీగా గొప్ప బ్రేక్‌ఫాస్ట్ ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవడంలో ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. మా మైక్రో-ఆంట్రప్రెన్యూర్‌ల విస్తృతమైన నెట్వర్క్ ద్వారా వినియోగంలో ఆసక్తికరమైన పద్ధతులపై సిఫార్సులను పొందుతాము మరియు న్యూట్రిషన్‌పై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మా ఆవిష్కరణలపై అభిప్రాయాలను కోరుతాము. మేము ఆహార విభాగంలోకి అడుగు పెడుతుండడంతో, ఈ భాగస్వామ్యం ద్వారా మేము ప్రజలకు ఎంతో విలువను అందించగలుగుతామని, ఆరోగ్యం మరియు ఇమ్యూనిటీ విబాగంలో మా నాయకత్వాన్ని మరింత ధృడంగా మార్చుకోగలుగుతామని విశ్వాసంగా ఉన్నాము.

“హెల్త్, వెల్‌నెస్, ఇమ్యూనిటీ విభాగాలలో భవిష్యత్తులో పెరగబోయే డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులను సహ సృష్టి చేసేందుకు రెండు కంపెనీలు కలిసి రావడంపై మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇది ఆమ్వే యొక్క చరిత్రలో మొట్టమొదటి ఈ తరహా అడుగు కాగా, వినియోగదారులకు విలువకు తగిన ప్రతిఫలం అందించేందుకు ఆవిష్కరణ మరియు అవకాశాల సృష్టి పై మా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటాము, మరియు ఇధి తొలి అడుగు మాత్రమే,” అని అన్షు బుధ్రాజా జోడించారు.

రోగనిరోధక శక్తికి మద్దతు క్లినికల్‌గా నిరూపితమైన పదార్ధం గల కొత్తగా లాంఛ్ చేసిన బీ న్యాచురల్+ రేంజ్ ఉత్పత్తులు ఆరెంజ్ మరియు మిక్సెడ్ ఫ్రూట్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉండనుండగా, 1 లీటర్ ప్యాక్‌లో లభించనుంది, దీని ధర రూ.130.

ITC Foods గురించి: ITC లిమిటెడ్ యొక్క విభాగం

భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, ఫాబెల్, సన్‌బీన్, మరియు గమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ & కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ & బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం (HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది.

తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.

ఆమ్వే ఇండియా గురించి

ఆదా, మిచిగాన్, యూఎస్ఏలో ప్రధాన కార్యాలయం గల ఆమ్వే సంస్థకు పూర్తి అనుబంధ సంస్థ ఆమ్వే ఇండియా. ప్రపంచంలో #1[1] డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఉన్న ఆమ్వే, 100కు పైగా దేశాలు మరియు ప్రాంతాలలో ఉనికి కలిగి ఉంది.

అంతర్జాతీయంగా, ఆమ్వేకు 60 సంవత్సరాల వయసు, 8.4 బిలియన్ యూఎస్ డాలర్ల కలిగి ఉండగా, నాణ్యమైన వినియోగ వస్తువులను తయారు చేసి నేరుగా విక్రయించే సంస్థ. ఆమ్వే సంస్థకు చెందిన వినూత్నమైన ఆవిష్కరణ మరియు పరిశ్రమ ప్రముఖ ఆర్ అండ్ డీ (పరిశోధన మరియు అభివృద్ధి) విభాగం 750కు పైగా పేటెంట్‌లను సాధించగా, మరో 720 పేటెంట్‌లు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక ఉత్పత్తిపై పరిశోధన మరియు అభివృద్ధిని అందించడానికి 11 ప్రాంతాలలో మా ఆవిష్కరణ మరియు విజ్ఞాన సామర్థ్యాలను విస్తరించే 500 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులు ఆమ్వేలో ఉన్నారు.

విలక్షణమైన నాణ్యమైన ఉత్పత్తుల ఉపయోగంపై వ్యక్తిగత సిఫార్సులు చేసే ఆమ్వే డైరెక్ట్ సెల్లర్స్ ద్వారా న్యూట్రిషన్, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ కేర్ మరియు కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి విభాగాలలో 140 కి పైగా రోజువారీ వినియోగ ఉత్పత్తులను ఆమ్వే ఇండియా విక్రయిస్తుంది. నాణ్యత మరియు విలువ అంశాలపై ఆమ్వే ఉత్పత్తులకు విస్తృతమైన గుర్తింపు ఉంది మరియు ప్రశంశలను అందుకున్నా. ఈ ఉత్పత్తుల వినియోగంపై 100% సంతృప్తి చెందకపోతే నగదవు వాపసు చేస్తామనే గ్యారెంటీ అందించబడుతుంది. [2]. వినియోగదారుల సంఖ్యను పెంచుకునే పెంచే లక్ష్యంతో ఆమ్వే సంస్థ దేశవ్యాప్తంగా 65 కి పైగా ఎక్స్‌ప్రెస్ పిక్ అండ్ పే స్టోర్స్‌ను ఏర్పాటు చేసింది.