గిన్నిస్ వరల్డ్ రికార్డును® సొంతం చేసుకున్న ITC లిమిటెడ్ Sunfeast YiPPee!కి సంబంధించి జరిగిన 10వ వార్షికోత్సవ వేడుకలు

అసలైన YiPPee! క్షణాలివి. భారతదేశ నూడుల్ 2894 ప్రేమికులంతా కలిసికట్టుగా ఒకేసారి తమకిష్టమైన నూడల్స్ తింటూ ఫొటోలు తీసుకుని మరీ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే తొలిసారిగా గంట వ్యవధిలో అత్యధికంగా ఫోటోలు అప్‌లోడ్ చేశారు.

Sunfeast YiPPee!, ఇండియా మోస్ట్ పాపులర్ మరియు ప్రియమైన నూడల్స్ బ్రాండ్. 10వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులు దీనిపై తమకున్న ప్రేమనంతా కలిపి  YiPPee!  తింటూ వర్చువల్‌గా ఒకరికొకరు పంచుకున్నారు. ఈ అధ్బుతమైన క్షణాలను ఆస్వాదించడమే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డుగా మలిచారు. ‘‘గంట వ్యవధిలో అత్యధికంగా నూడుల్స్ తింటూ ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసి రికార్డు సాధించారు. ఇందులో పాల్గొన్న ప్రతిఒక్కరికీ గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి అధికారికంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందుతుంది. దీంతో పాటు Sunfeast YiPPee! నుంచి కూడా పత్రం చేరుతుంది.

ఆన్ లైన్ ద్వారా అన్ని వయసుల వారు ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పండగతో YiPPee! అంటే యువత, పెద్దలు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్ధమవుతుంది.  వినియోగదారుల విశ్వాసం, వారి మన్ననలతో YiPPee విలువ ఈ పదేళ్లలో ఎంతో పెరిగింది. మార్కెట్లో రూ.1000 కోట్లుగా విలువ కలిగిన అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. కస్టమర్ల ప్రోత్సాహంతో దేశంలోనే YiPPee! 2వ అతిపెద్ద ఇన్‌స్టంట్ నూడుల్ బ్రాండ్‌గా అవతరించింది.  YiPPee! ఇటీవల కాలంలో అత్యధికంగా అమ్మడువుతున్న బ్రాండ్‌గా అవతరించింది. వినియోగదారుల నిత్యావసరాల్లో ఇదో భాగంగా మారింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 50శాతం గ్రోత్ రేటు సంపాదించింది. ప్రతి దేశంలో చివరి మైలురాయి వరకూ ప్రతి ఒక్క కస్టమర్‌కు అందుబాటులో ఉండేలా కంపెనీ చేసింది. రికార్డు సమయంలో డెలివరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. మాకున్న డెలివరీ పార్టనర్ షిప్ వ్యవస్థ మరియు ITC కున్న విస్తృత నెట్‌వర్క్ ద్వారా డెలివరీ సరికొత్త విధానాలు అవలంభిస్తూ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చేస్తున్నాం. అంతేకాదు శుభ్రతతో పాటు, ఫిజికల్ డిస్టెన్స్ వంటి కఠిన నిబంధనలు పాటిస్తూనే ఈ కష్ట సమయంలో కూడా డెలివరీ సిస్టమ్ దెబ్బతినకుండా అందరికీ అందేలా చూస్తున్నాం.

2010లో మార్కెట్లోకి వచ్చిన YiPPee! మెరుగైన ప్రమాణాలతో తనదారి విస్తరించుకుంటూవస్తోంది. దీని  డిఎన్ఏ లోనే అత్యుత్తమ లక్షణాలు కలిగి ఉన్నాయంటున్నారు ITC లిమిటెడ్, ఫుడ్ డివిజన్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్,  శ్రీ హేమంత్. ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న వాటికి భిన్నంగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండటమే కాదు.. వారి మనసు చూరగొని అత్యుత్తమ నూడుల్ బ్రాండ్ గా అవతరించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ఫీట్ ద్వారా YiPPee! ఏస్థాయిలో వినియోగదారుల ప్రేమాభిమానాలకు సంపాదించుకుందో అద్దం పడుతుందన్నారు శ్రీ హేమంత్. భారతీయులు తమ బ్రాండ్ నూడుల్స్ నే ఏస్థాయిలో ఆదరిస్తున్నారో గ్లోబల్ ఆడియన్స్ చూపించారు అరుదైన అధ్బుత క్షణాలివన్నారు. తాము అమితంగా ఇష్టపడే YiPPee! నూడుల్స్ పై ఇంత ప్రేమను చూపించిన వినియోగదారులకు సదా రుణపడిఉంటామన్నారు. వారి మద్దతు, ప్రోత్సాహం YiPPee! పై ఎల్లప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం. రానున్న దశాబ్ధానికి మరింత వినూత్నంగా, సరికొత్తగా తీసుకెళ్లడానికి ఈ ఘట్టం మైలురాయిగా నిలుస్తుందన్నారు.

వినూత్నంగా ఉంటూ అద్భుతమైన అనుభూతిని, రుచిని అందించేలా సంప్రదాయ ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు భిన్నంగా మార్కెట్లోకి వచ్చింది YiPPee!. 2010లో లాంచ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ విభాగంలో రకరకాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ద్రుష్టిలో పెట్టుకుని తీసుకురావడం జరిగింది. ITC సంస్థకుండే బలమే దీనికి మూలాధారం. విభిన్న విభాగాల్లో కంపెనీకున్న వినియోగదారులు, వారి అభిరుచులు తెలిసిన సంస్థగా పేరు, నిపుణులు, బలమైన సరఫరా వ్యవస్థ, R&D లో అనుభవం. దీనికి తోడు ITC గ్రూప్‌లోని ఆహారపు అలవాట్లపై నిపుణులైన హోటల్ చెఫ్ లు, సంస్థకు చెందిన  ఆశీర్వాద్ అట్టా, వెజిటబుల్స్, మసాలా వంటి ముడిపదార్ధాలు అదనపు బలం. లాంగ్ స్లర్ప్ వర్తీ నూడుల్, స్పెషల్ సైంటిఫిక్ ప్రాసెస్ తో వినియోగదారులకు అధ్బుతమైన పోషకాలతో కూడిన నూడుల్స్ అందివ్వగలుగుతోంది. త్వరలో లాంగ్ మరియు నాన్ స్టికీ నూడుల్స్ కూడా రానున్నాయి. అన్ని వయసుల వారి అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తిని మరింతగా అభివృద్ధి చేసి కొత్తకొత్త మార్కెట్లలో విడుదల చేయడానికి రెడీ అవుతొంది సంస్థ. ఈ ఏడాది నుంచి YiPPee! నూడుల్స్ కు బ్రాండ్ అంబాసిడార్ గా మహేంద్ర సింగ్ ధోనీ రావడం మరో విజయం.

బ్రాండ్ వార్షికోత్సవ వేడుకలను కనులారా వీక్షించాలంటే మీరు Sunfeast YiPPee! అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యేకంగా రూపొందించిన పేజీలో చూడవచ్చు. ఎంతమంది ఈ వేడుకులో భాగస్వాములు అయ్యారో కళ్లారా చూసి మీరూ ఆస్వాదించవచ్చు.

YiPPee! ప్రస్తుతం ఇన్ స్టంట్ నూడుల్స్ మరియు పాస్తా కేటగిరిలో ఉత్పత్తులను అందిస్తోంది. YiPPee! నూడుల్స్ ప్రస్తుతం నాలుగు విభాగాలున్నాయి. మేజిక్ మసాలా, మూడ్ మసాలా, పవర్ అప్ మసాలా నూడుల్స్ మరియు క్విక్ మీల్జ్ కోవ్ స్యూ(Quik Mealz Kow Suey) ఉన్నాయి. ఇక పాస్తాలో అరు రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి.–  ట్రైకలర్ క్రీమీ కార్న్(Tricolour Creamy Corn), ట్రైకలర్ మసాలా (Tricolour Masala), టొమాటో చీజ్ (Tomato Cheese), మసాలా (Masala), చీజ్ (Cheese) మరియు సోర్ క్రీమ్ ఆనియన్ (Sour Cream Onion).  రానున్న రోజుల్లో YiPPee!  సరికొత్త ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వస్తోంది.

లింక్ కోసం Sunfeast YiPPee! యొక్క ఫేస్‌బుక్ ఈవెంట్ పేజ్ చూడండి:

ITC Foods గురించి: ITC లిమిటెడ్ యొక్క విభాగం

భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, ఫాబెల్, సన్‌బీన్, మరియు గమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ & కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ & బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం (HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది. తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.