ITC లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్ ప్రవేశపెడుతోంది ‘సన్‌ఫీస్ట్ కేకర్’. కేక్స్ విభాగంలో ఉనికిని మరింత విస్తరించేలా వినూత్నఫార్మాట్‌లో ఈ ఆవిష్కరణను ముందుకు తెస్తోంది

డార్క్ ఫాంటసీ కుకీస్‌ వంటి ఉత్పత్తులతో మార్కెట్‌కు కొత్త రుచులను పరిచయం చేసి అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు మరో సరికొత్త ఆవిష్కరణ ద్వారా కేక్స్ సెగ్మెంట్ కేటగిరీకి పునర్నిర్వచనం ఇచ్చేందుకు సిద్ధమైంది

ITC యొక్క సన్‌ఫీస్ట్ వినియోగదారులు అమితంగా ఇష్టపడే కన్‌జ్యూమర్ బిస్కట్స్ బ్రాండ్లలో ఒకటి. ఇప్పుడు కేక్స్ విభాగంలో అడుగు పెట్టడం ద్వారా ఒక కొత్త సబ్-బ్రాండ్ ప్రవేశపెడుతోంది, అదే సన్‌ఫీస్ట్ కేకర్. వినియోగదారులకు అందుబాటు ధరలలో అత్యుత్తమమైన రుచులు అందించే విధంగా వినూత్నమైన ప్రొడక్టులు ప్రవేశపెట్టడంలో ఈ బ్రాండ్ ఓ ప్రత్యేక పోర్టుఫోలియో కలిగి ఉంది. విస్తృత స్థాయిలో ఉన్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా వారికి మరింత సౌకర్యంగా ఉండేలా మరియు సంతృప్తిని కలిగించేందుకు తన విభాగాలను మరింత విస్తరించే దిశగా సాగుతోంది. వారు తమ అల్పాహారం మరింత ఆస్వాదించే విధంగా ముందడుగు వేస్తోంది. సన్‌ఫీస్ట్ కేకర్‌ సిగ్నేచర్‌తో సహా మూడు ఫార్మాట్లలో ప్రవేశపెట్టబడుతోంది. ఈ విభాగంలో మొదటిది ‘ట్రినిటీ’, ఈ ఉత్పత్తి ఒక విభిన్నమైన ఆవిష్కరణ.  ఇంతకు ముందెన్నడూ చవిచూడని విధంగా ఒక అద్భుతమైన రుచిని పరిచయం చేస్తుంది. ఇది ట్రిపుల్ లేయర్డ్ కేక్. ఇందులో దిగువ భాగంలో చాకో ఉంటుంది. మధ్య భాగంలో చాకో క్రీమ్ నిండి ఉంటుంది.  ఇక పై భాగంలో చాకో డ్రిజిల్ నోరూరిస్తుంది.  రెండో ఫార్మాట్ సరికొత్తగా కనిపిస్తుంది. అదే చాకో స్విస్ రోల్, ఇది ఒక చాకో డ్రిజిల్‌తో అలంకరించబడి ఉంటుంది. చూసేందుకు అత్యద్భుతంగా కనిపించే ఒక ఫ్రెష్ బేకరీ ప్రొడక్ట్. ఇక మూడవది మరింత ఉత్తేజం కలిగించే ఉత్పత్తి అయిన లేయర్ కేక్స్. ఇవి చాకో మరియు బటర్‌స్కాచ్ అనే రెండు వేరియంట్‌లలో లభ్యమవుతాయి.

సన్‌ఫీస్ట్ గతంలో 2018లో సన్‌ఫీస్ట్ కేక్‌లను ప్రారంభించడంతో 2500+ కోట్ల కక్ విభాగంలోకి ప్రవేశించి వినియోగదారుల ఆదరణ చూరగొంది. కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే లేయర్డ్ కేక్స్ సెగ్మెంట్‌లో ముందంజలోకి వచ్చింది. ఈ విభాగంలో 22% మార్కెట్ షేర్ కలిగిన సన్‌ఫీస్ట్ ఈ సరికొత్త ఉత్పత్తి ద్వరా తన కేక్స్ పోర్టుఫోలియోను మరింతగా విస్తరిస్తోంది.

ఈ ఉత్పత్తిని ప్రవేశపెడున్న సందర్భంగా ITC లిమిటెడ్ బిస్కట్స్ & కేక్స్ క్లస్టర్, ఫుడ్స్ డివిజన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అలీ హారిస్ షరె మాట్లాడుతూ ‘‘భారతదేశంలో కేక్స్ విభాగంలో మంచి ఆశాజనకమైన పురోగతి కనిపిస్తోంది. ఇది ఇంకా పెరుగుతుంది. దీనిని పరిగణనలోకి తీసుకుని బిస్కట్స్ సెగ్మెంట్‌లో  మాకున్న అనుభవం దృష్ట్యా మా ఉత్పత్తులు మరింత విస్తరించడానికి ఇదే సరైన సమయం అని మేము భావిస్తున్నాము. ప్యాకేజ్‌డ్ కేక్స్ విషయంలో కొనుగోలుదారుల ఆసక్తులను వారి వినియోగాన్ని పున: నిర్వచించే రీతిలో ఈ విభాగంలో మరింత పురోగతి సాధించడమే మా ప్రధాన లక్ష్యం.  మా ప్రత్యేకమైన ఉత్పత్తుల ద్వారా ఫ్రెష్ బేకరీ కేక్స్ మరియు ప్యాకేజ్‌డ్ కేక్స్ మధ్య పోటీలో ఉండే వెలితిగా అనిపించే అంశాలను భర్తీ చేయడం ద్వారా వినియోగదారులను  ఆకట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తాం.  దేశం విశ్వసించే ఒక బ్రాండ్‌గా ప్రత్యేకంగా రూపొందించిన సన్‌ఫీస్ట్ కేకర్ కొత్త రేంజ్‌తో దేశం నలుమూలలా ఉన్న ఇళ్లలో ఆనందం పంచాలన్నదే మా ముందున్న ఆశయం.’’ అని వివరించారు.

ఈ ప్రీమియం క్వాలిటీ సమర్పణలు ఇండస్ర్టీ ప్రైస్ పాయింట్స్ మేరకు వినియోగదారులు అందరికీ సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఇంటిలోనూ తప్పనిసరిగా దీనిని ఆస్వాదించేలా చేయడమే లక్ష్యంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. 28 గ్రాముల ట్రినిటీ ఎస్‌కెయు మరియు 29 గ్రాముల స్విస్ రోల్ ఎస్‌కెయు రూ. 10 ధరకు లభిస్తాయి. ఇక లేయర్ కేక్స్ రెండు ధరల్లో లభిస్తాయి. వరసగా రూ. 5 & రూ. 10 ధరల్లో ఇవి లభిస్తాయి. సన్‌ఫీస్ట్ కేకర్ దేశ వ్యాప్తంగా నవంబర్ 2020 నుంచి అందుబాటులోకి వస్తుంది.

ITC Foods గురించి: ITC లిమిటెడ్ యొక్క విభాగం

భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, ఫాబెల్, సన్‌బీన్, మరియు గమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ & కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ & బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం (HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది.

తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.