చిన్నారులలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు మద్దతు ఇచ్చే 2 మూలకాలు అయిన విటమిన్ సీ మరియు జింక్‌లను కలిగిన జెలిమల్స్ ఇమ్యునోజ్ జెల్లీస్ వైపు తమ పోర్ట్‌ఫోలియో ఆఫరింగ్స్‌ను షిఫ్ట్ చేసిన కన్ఫెక్షనరీ బ్రాండ్ ITC లిమిటెడ్.

రోజుకు రెండు జెల్లీస్ పిల్లలకు ఇవ్వడం ద్వారా చిన్నారుల్లో 50% RDAతో విటమిన్ సీ మరియు 15% RDAతో జింక్ వంటి పోషకాలు అందుతాయి

ITC కంపెనీకి చెందిన కన్ఫెక్షనరీ బ్రాండ్ జెల్లీ సెగ్మెంట్ అయిన జెలిమల్స్ పోషకాలతో కూడిన జెలిమల్స్ ఇమ్యునోజ్ జెల్లీస్ వైపు ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా విటిమన్ సి మరియు జింక్ వంటి న్యూట్రెంట్స్‌తో ఉత్పత్తులను తీసుకొస్తోంది. ఇది చిన్నారుల్లో వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. పాండెమిక్ పరిస్థితుల్లో పిల్లలు సంతోషంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేయడం కంపెనీ ఉద్దేశం. ఉత్పత్తులతో పాటు.. పాండెమిక్ గురించి అవగాహన కూడాకల్పిస్తుంది కంపెనీ. ఇందులో భాగంగా చిన్నారులకు అవగాహన కల్పించేలా WHO నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ‘‘Do the 5‘‘ పేరుతో కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ ఓ పాటను కూడా రూపొందించడం జరిగింది. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సహజ పద్ధతిలో కంపెనీ ఈ ప్రోడక్ట్‌ను లాంచ్ చేసింది.

చిన్నారులకు సంబంధించిన కన్ఫెక్షనరీ మార్కెట్‌ను జెల్లీ విభాగం ఎప్పటికప్పుడు వినూత్నంగా ఉంటూ ముందుకు నడిపిస్తుంది. ఆకర్షణీయమైన రంగులు, ఆసక్తికరంగా ఉండే ఆకారంతో చిన్నారులను ఆకట్టుకుంటాయి ఈ జెల్లీ ఉత్పత్తులు. ప్రస్తుతమున్న పాండెమిక్ పరిస్థితులు ఇమ్యూనిటీ పెంచే ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెంచాయి. ఇందులో భాగంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, మరీ ముఖ్యంగా చిన్నారులకు సరైన పోషకాలు ఇచ్చేలా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ITCకి చెందిన లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ -LSTC సైంటిస్టులు ప్రత్యేకంగా కొత్త ఉత్పత్తులపై నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. ఆరోగ్యం కాపాడుతూ ఇమ్యూనిటీ పెంచే పోషకాలుండే ఉత్పత్తులను రూపొందించడంపై ఫోకస్ పెట్టడం జరిగింది.

అంతేకాదు.. దీనిపై ఎంపిరికల్ స్టడీ కూడా చేయడం జరిగింది. దీనిని ఇన్‌ఫో లీప్ మార్కెట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ఎల్.ఎల్.సి. న్యూ నార్మల్ వాల్డ్‌లో చిన్నారుల కోణంలో సమగ్రంగా స్టడీ చేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా వంటి నగరాల్లో 8-12 ఏళ్ల మధ్య వయసున్న 364 మంది చిన్నారుల నుంచి డేటా సేకరించడం జరిగింది. 94శాతం మంది స్కూలు మిస్ అవుతున్నట్టు తెలిపారు. 90శాతానికి మందికి పైగా స్నేహితులను నేరుగా కలుసుకోలేకపోతున్నట్టు చెప్పారు. వాళ్లకు సూపర్ పవర్ కనుక ఇస్తే, 74% మంది చిన్నారులు కొవిడ్ 19 నుంచి “ప్రజలను కాపాడడానికి(56%), మరియు చికిత్స కనుగొనడానికి (18%)” ఉపయోగిస్తామని సమాధానం ఇస్తున్నారు. తమ పేరెంట్స్, కుటుంబసభ్యుల గురించి కూడా (38%) ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. మానవత్వం, ముఖ్యంగా వైద్యులు, సైనికులు, స్నేహితులు, జంతువులను కాపాడుకోవడంతో పాటు.. వైరస్ టెస్టుల చేయాల్సిన అవసరం చాటుతున్నారు.

చిన్నపిల్లలకు సంబంధించిన ఉత్పత్తులు అందించే బ్రాండ్‌గా మేం వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి అవసరం అయిన విటమిన్ సి మరియు జింక్ వంటి పోషకాలున్న ఉత్పత్తులు రోజూ అందించడం బాధ్యతగా భావిస్తున్నామని ITC లిమిటెడ్‌కు చెందిన చాకలోట్, కాఫీ, కాన్ఫక్షనరీ అండ్ న్యూ కేటగిరి డెవలప్‌మెంట్ -ఫుడ్స్ విభాగం సీఓఓ శ్రీ అనుజ్ రుస్తాగి అన్నారు. అందుకే జెలిమల్స్ రూపంలో అందిస్తున్నట్టు తెలిపారు. పేరెంట్స్ మరియు పిల్లలు మరింతగా ఆనందించేలా ప్రాముఖ్యత తెలుసుకునేలా “Do the 5” వీడియో కూడా చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఇక ముందు కూడా జెల్లీ బియర్స్ రేంజ్ మొత్తం జెలిమల్ ఇమ్యనోజ్ గా మార్చడానికి ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలిపారు. అంతేకాదు వినియోగదారులకు భారం పడకుండా అదే ధరను కూడా కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతమున్న ఉత్పత్తుల్లో స్వల్ప మార్పులు అనిపించినా.. మన చిన్నారుల ఆరోగ్యం కాపాడుకోవడంలో భాగంగా పెద్దమార్పు అంటున్నారు సీఓఓ శ్రీ అనుజ్ రుస్తోగీ.

జెలిమల్స్ ఇమ్యూనోజ్ రెండు ఎస్.కె.యు.ల్లో అందుబాటులో ఉంటాయి. ఒకటి 30గ్రాములు కాగా, రెండోది 108 గ్రాములు ఉంటుంది. వీటి ధరలు రూ.10 మరియు రూ.50గా ఉంటుంది.

ఫ్రూట్ ఫ్లేవర్స్ తో పాటు.. ఎగ్జైటింగ్ టాయ్స్ తో అందుబాటులో ఉంటాయి జెల్లీ ఉత్పత్తులు. డబుల్ లేయర్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఇక రూ.50 ధరలో లభించే ప్యాకెట్ జిప్‌లాక్ ప్యాక్ రూపంలో వస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రీటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.

ITC Foods గురించి: ITC లిమిటెడ్ యొక్క విభాగం

భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, ఫాబెల్, సన్‌బీన్, మరియు గమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ & కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ & బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం (HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది.

తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.