చూడండి: రాజస్థాన్ రాయల్స్ గురించిన ఒక ప్రత్యేకమైన తెరవెనుక సన్నివేశాల డాక్యుమెంటరీ-సిరీస్

~ ఈ మూడు-భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌ను రెడ్ బుల్ మీడియా హౌస్ నిర్మించింది

~ రెడ్ బుల్ టీవీలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది

భారతదేశం: ‘ఇన్‌సైడ్ స్టోరీ: ఏ సీజన్ విత్ రాజస్థాన్ రాయల్స్ పేరుతో రెడ్ బుల్ మీడియా హౌస్ నిర్మించిన ఈ మూడు-భాగాల డాక్యుమెంటరీ సిరీస్ మిమ్మల్ని ఈ ప్రాంచైజీకి రోలర్‌కోస్టర్ లాంటి 2019 ఐ.పి.ఎల్ సీజన్‌లో తెరవెనుక సన్నివేశాల్లోకి తీసుకు వెళ్తుంది. ఈ డాక్యుమెంటరీని ఇప్పుడు రెడ్ బుల్ టీవీ: redbull.com/rajasthanroyalsలో చూడండి.

ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుల్ టీవీలో అందుబాటులో ఉన్న ఈ డాక్యుమెంటరీ మీకు రాయల్స్ కుటుంబపు రహస్యాలను కళ్లకు కడుతుంది. ఆ జట్టు సభ్యుల ఇంటర్వ్యూలతో పాటు రాయల్స్ శిబిరం నుంచి మీరు ఇప్పటివరకు చూడని సన్నివేశాలను మీ ముందుకు తెస్తుంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, వరుణ్ ఆరోన్ మరియు రియాన్ పరాగ్ లాంటి ఆ జట్టులోని ప్రముఖ క్రీడాకారులు కనిపించే ఈ డాక్యమెంటరీ ద్వారా ఆ సీజన్‌లో ఆ ప్రాంచైజీ చవిచూసిన ఎత్తుపల్లాలను అభిమానులు మరింత సవివరంగా తెలుసుకోవచ్చు.

భారతదేశపు ప్రముఖ క్రికెట్ జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌ను ఈ జట్టు సొంతం చేసుకుంది. ఆసమయంలో ఈ జట్టులోని ప్రముఖ క్రీడాకారులైన రాహుల్ ద్రావిడ్, షేన్ వార్న్, షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్, అజింక రహానే, మరియు ఇతర ఆటగాళ్లు ఈ విజయానికి బాటలు వేశారు.

ఈ నేపథ్యంలో, 2019 సీజన్‌లో ఈ జట్టు ప్రయాణాన్ని డాక్యుమెంటరీగా చిత్రీకరించే అవకాశాన్ని రెడ్ బుల్ మీడియా హౌస్‌కు అందించడం కోసం, రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీ మొట్టమొదటిసారిగా తమ స్టేడియం, ట్రైనింగ్ ఆకాడమీలు, బోర్డ్ రూమ్‌లు, టెక్ హబ్‌లు, మరియు మరెన్నింటికో తలుపులు తెరిచింది. ఒక విశిష్టమైన డాక్యుమెంటరీ సిరీస్ రూపుదిద్దుకోవడానికి ఇదొక అవకాశంగా మారింది. ఒక క్రికెట్ ఫ్రాంచైజీని ఎలా నడపాలో ఇందులో చూడొచ్చు. కానీ, నిజానికి, ఇందులో అంతకు మించిన విషయాలు కనిపిస్తాయి. ‘ఇన్‌సైడ్ స్టోరీ: ఏ సీజన్ విత్ రాజస్థాన్ రాయల్స్’ అనే ఈ మూడు-భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌లో ఒక ఐ.పి.ఎల్ సీజన్‌ సమయంలోని విభిన్న కథనాలు ఆవిష్కృతమవుతాయి. ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్, మద్దతుదారులు మరియు మొత్తం జట్టు – రాయల్ కుటుంబం కథనాలు ఇందులో కనిపిస్తాయి.

జట్టు ప్రయాణం తెరవెనుక కథతో మొదలయ్యే ఈ సిరీస్‌లో ఒక ప్రముఖ క్రికెట్ ఫ్రాంచైజీ లోపల ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తారనే అరుదైన విషయాలను కళ్లకు కడుతుంది. 2019 సీజన్‌లో మొదటి కొన్ని మ్యాచ్‌లలో ఈ జట్టు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు ఇందులో చూడొచ్చు. ఆసమయంలో ఈ జట్టుకు ఎదురైన ప్రతికూల ఫలితాలను అభిమానులు “బ్యాడ్ లక్” అని పేర్కొన్నారు. ఒక క్రికెట్ ఫ్రాంచైజీ డైనమిక్స్ ఎలా ఉంటాయి, వాళ్లు పైచేయి సాధించడానికి కారణమేమిటి, ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి వాళ్లు ఎలాంటి వినూత్న సాంకేతికత మరియు కోచింగ్ పద్ధతులు ఎంచుకున్నారో ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు. రెడ్ బుల్ క్యాంపస్ క్రికెట్ మరియు రాయల్స్ కల్ట్స్ మరియు స్పార్క్స్ లాంటి రాజస్థాన్ రాయల్స్ సొంత నైపుణ్య-నిర్మిత కార్యక్రమాల ద్వారా కొత్త ప్రతిభావంతులను సొంతం చేసుకునే వారి వైఖరి ఇందులో కనిపిస్తుంది. అయితే, మరీ ముఖ్యంగా సవాలుభరిత సమయాల్లోనూ విజయం కోసం వీలైన అత్యుత్తమ అవకాశం అందుకోవడానికి రాజస్థాన్ రాయల్స్‌లో భాగమైన అందరూ ఎలా కలిసి పనిచేశారు మరియు సమిష్టిగా శ్రమించారో ఈ డాక్యుమెంటరీ వివరిస్తుంది.

English Cricketer Ben Stokes is seen during filming of the Rajasthan Royals documentary series on Red Bull TV in region, country on Month Date, Year. Editor’s Note: This image is a screenshot.

ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ విడుదల సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ఆల్-రౌండర్ మరియు రెడ్ బుల్ అథ్లెట్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ, “గత ఐ.పి.ఎల్ సీజన్‌లో, బౌలర్లు అందరికీ, ప్రత్యేకించి నాలాంటి యువ ఆటగాళ్లకి స్మడ్జ్ (స్మిత్) ఎలా వెన్నుదన్నుగా నిలిచాడో తలచుకుంటే నాకు అద్భుంగా ఉంటుంది. అతనొక గొప్ప నాయకుడు. అతని సారథ్యంలో ఆడడాన్ని నేను గొప్పగా ఆస్వాదించాను. ఐ.పి.ల్ సమయంలో రెడ్ బుల్ నిరంతరం నన్ను అనుసరించడం కూడా నాకు అద్భుతంగా అనిపించింది. భవిష్యత్తులోనూ వారి నుంచి అలాంటి మద్దతు లభిస్తుందని నేను ఎదురు చూస్తున్నాను” అన్నారు.

గత ఐ.పి.ఎల్ సీజన్ ద్వారా మళ్లీ జట్టులో భాగమైన ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన పునరాగమనం గురించి మాట్లాడుతూ, “గత సీజన్ ద్వారా నేను మళ్లీ రాజస్థాన్ రాయల్స్ లోకి తిరిగి రావడం గొప్పగా అనిపించింది. 2014 మరియు 2015లో నేను ఈ జట్టులో ఉన్నాను. ఈ జట్టు యజమానులు మరియు ఈ ఫ్రాంచైజీ ప్రొఫెషనలిజమ్ నాకెప్పుడూ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ఫ్రాంచైజీలోని డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక కుటుంబం లాంటి వాతావరణం ఉంటుంది. గత సీజన్‌లో మేము గొప్పగా ఆడలేకపోవడం కొంచెం అసంతృప్తిగా కలిగించింది. కానీ, ఒక్కోసారి అది కూడా ఆటలో భాగమే. యువతరం మరియు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో ఈ జట్టు ఒక గొప్ప మిశ్రమంగా ఉంటుంది. ఇప్పుడు మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని భావిస్తున్నాము. రానున్న సీజన్ మీద మేము గొప్ప నమ్మకంతో ఉన్నాము” అన్నారు.

ఈ డాక్యుమెంటరీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ క్రీడాకారులు – స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, ఇష్ సోధీ, వరుణ్ ఆరోన్, రియాన్ పరాగ్ మరియు జయ్‌దేవ్ ఉనాద్‌కట్ మరియు మాజీ ఆటగాళ్లు – అజింక్య రహానే, ధవాల్ కుల్‌కర్ణి లాంటి వారితో, మాజీ హెడ్ కోచ్ ప్యాడీ అప్టాన్‌తో సహా కోచించ్ సిబ్బందితో, ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ అమోల్ ముజుందార్, స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే, మరియు హెడ్ ఆఫ్ క్రికెట్ జుబిన్ భరుచా, మరియు మాజీ క్రికెటర్లు అంజుమ్ చోప్రా, సుహైల్ చందోక్ మరియు షేన్ వార్న్ లాంటి వారితో ఇంటర్వ్యూలు చూడొచ్చు. అలాగే, ఈ సిరీస్‌ పూర్తిగా 2019 వ్యాప్తంగా ఈ ఫ్రాంచైజీని అనుసరిస్తూ జట్టు చవిచూసిన ఎత్తుపల్లాలతో పాటు విజయాలు మరియు ఓటమి సమయంలో జట్టు భావోద్వేగాలను కళ్లకు కడుతుంది.

ఎపిసోడ్ సంగ్రహం

ఎపిసోడ్ 1: రాజస్థాన్ రాయల్స్ జట్టుకి సంబంధించిన కోచ్‌లు మరియు మేనేజ్‌మెంట్ గురించి ఇందులో సవివరంగా ఉంటుంది. అనుభవజ్ఞులు మరియు కొత్త వారు మిశ్రమంగా ఉండే మ్యాచ్ విన్నింగ్ జట్టుని సమిష్టిగా నిలిపేందుకు తెరవెనుక పనిచేసే జట్టు ఇది. అయితే, దురదృష్టవశాత్తూ గత సీజన్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లు ఈ జట్టుకు కలిసి రాలేదు.

ఎపిసోడ్ 2: మొదటి మూడు కఠిన మ్యాచ్‌ల రూపంలో ప్రతికూల ఫలితాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత ఘన విజయంతో సత్తా చాటింది. దురదృష్టవశాత్తూ, కొన్ని అసందర్భ పరిస్థితుల్లో ఫలితాలనేవి ఎల్లప్పుడూ మనం కోరుకున్న విధంగా ఉండవు. అయితే, భారతదేశపు భవిష్యత్ క్రికెట్ సూపర్‌స్టార్‌ను తెరమీదకు తెచ్చే ప్రయత్నంలో ఉన్న రెడ్ బుల్ క్యాంపస్ క్రికెట్‌తో భాగస్వామ్యం ద్వారా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ తన విశ్వాసం సడలిపోకుండా కొనసాగిస్తోంది.

ఎపిసోడ్ 3: గత సీజన్ వ్యాపార ముగింపు పరంగా చూస్తే, ప్లేఆఫ్‌కు అర్హతతో రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆట మీద పట్టు వదలకూడదని జట్టు భావించింది. కానీ, దురదృష్టవశాత్తూ ఒక క్లిష్టమైన టై మ్యాచ్ వారి ఆశలను తలకిందులు చేసింది. వర్షం ఆ మ్యాచ్‌కు అడ్డంకి కావడం ద్వారా వారి విజయ యాత్రకు బ్రేక్ పడింది. మీరు ఇప్పటివరకు చూడని, వడబోయని, కచ్చితంగా చూసి తీరాల్సిన డాక్యమెంటరీ ఇది. ఒక సీజన్, ఒక కథ, ఒక కుటుంబం ఇందులో కనిపిస్తుంది. చూడండి, రెడ్ బుల్ మీడియా నిర్మించిన ‘ఇన్‌సైడ్ స్టోరీ: ఏ సీజన్ విత్ రాజస్థాన్ రాయల్స్’. రెడ్ బుల్ టీవీలో అందుబాటులో ఉంది. ఉచిత రెడ్ బుల్ టీవీ యాప్‌ను అన్ని డివైజ్‌లలో ఉచితంగా యాక్సెస్ చేయండి! యాప్‌ను ఇక్కడ పొందండి.