భారతదేశ మొట్టమొదటి యాంటీ వైరల్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ ను ఆవిష్కరించిన డ్యూరోఫ్లెక్స్

స్విస్ హైక్యూ వైరోబ్లాక్ సాంకేతికతతో శక్తివంతం. హానికారక క్రిములు మరియు బాక్టీరియాలను నిమిషాల్లోనే 99.99% దాకా హతమారుస్తుంది. ప్రతీ భారతీయ ఇంటిని సురక్షితంగా ఉంచడమే లక్ష్యం.

మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలసికట్టుగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఒక జాతిగా మనకు ఆరోగ్యం, సురక్షిత అనేవి మనకు అత్యంత ముఖ్యమైన ప్రాథమ్యాలుగా మారాయి. ఇంటినుంచి బయటకు అడుగు వేయాలంటే మాస్క్ లు, శానిటైజర్లు వంటి నూతన అంశాలు సాధారణమైపోయాయి. ఇంట్లో మనం అత్యధిక సమయం గడుపుతున్నాం, మరి అది మనల్ని ఇంట్లో సురక్షితంగా ఉండేలా చేయగలుగుతుందా? ఈ నేపథ్యంలో ప్రతీ భారతీయ ఇంటినీ సురక్షితం చేయగలిగే ఒక పరిష్కారాన్ని రూపొందించాలని 100 శాతం మేడిన్ ఇండియా బ్రాండ్, దేశం యొక్క అత్యంత విశ్వసనీయ స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన డ్యూరోఫ్లెక్స్ సంకల్పించింది. ఈ తరహా వినూత్నతలో భాగంగా భారతదేశ మొట్టమొదటి యాంటీవైరల్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్, స్విస్ సాం కేతికత హైక్యూ వైరోబ్లాక్ తో శక్తివంతమైన డ్యూరో సేఫ్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ ను డ్యూరోఫ్లెక్స్ ఆవిష్కరించింది. ఇది హానికారక క్రిములు మరియు బాక్టీరియాలను నిమిషాల్లోనే 99.99% దాకా హతమారుస్తుంది.

నిద్ర, సౌఖ్యంల అర్థాలను పునర్ నిర్వచిస్తూ, పరిశోధన ఆధారిత ఉత్పాదనలను రూపొందించడం ద్వారా డ్యూరోఫ్లెక్స్ ఎప్పుడూ వినూత్నత హద్దులను విస్తరిస్తూనే ఉంది. ఈ అధునాతన డ్యూరో సేఫ్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అనేది ఈ బ్రాండ్ అందిస్తున్న తాజా వినూత్నత. ఇంటెలిజెంట్ టెక్స్ టైల్ సాంకేతికత అయిన హైక్యూ వైరోబ్లాక్ తో ఇది శక్తివంతమైంది. సౌఖ్యం, సురక్షితలపై ఇది దృష్టిపెడుతుంది. కాంటాక్ట్ లోకి వచ్చిన వైరస్ లను హతమార్చేందుకు సిల్వర్ అయాన్లు మరియు వెసికల్స్ ను ఈ హైక్యూ వైరోబ్లాక్ సాంకేతికత ఉపయోగిస్తుంది.94 వైరస్ లపై ఇది పరీక్షించబడింది మరియు నిమిషాల్లోనే వాటిని డియాక్టివేట్ చేసినట్లుగా తేలింది. అంతేగాకుండా ఈ ప్రొటెక్టర్ 100% వాటర్ ప్రూఫ్, యాంటీ డస్ట్ మైట్, హైపో అలర్జెనిక్ గా ఉంటాయి. చర్మానికి సురక్షితంగా ఉంటాయి. తద్వారా ఈ సంపూర్ణ ఆరోగ్యదాయక పరిష్కారం భారతీయ ఇళ్లను సురక్షితంగా ఉంచుతుంది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా డ్యూరోఫ్లెక్స్ ఎండీ శ్రీ మాథ్యూ మాట్లాడుతూ, ‘‘మా కార్యకలాపాల్లో వినూత్నత అనేది అత్యంత ముఖ్యమైంది. చక్కగా రూపొందించబడిన స్లీప్ సొల్యూషన్స్ ను అందించడం ద్వారా భారతీయులందరి జీవితాలను మెరుగుపర్చడం డ్యూరోఫ్లెక్స్ లక్ష్యం. డ్యూరో ఫ్లెక్స్ డ్యూరో సేఫ్ యాంటీ వైరల్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ తో మేము మన అత్యంత సన్నిహిత స్థలమైన పడక గదుల్లో రక్షణ, సురక్షిత కవచాన్ని అందిస్తున్నాం. మనం మన జీవితాల్లో మూడోవంతును నిద్రలోనే గడిపేస్తుంటాం. నేడు మనం నిదురించే స్థలాలే మనం పని చేసుకునే స్థలాలుగా, లీజర్ జోన్ గా, ఇంకా మరెన్నో విధాలుగా మారిపోయాయి. మనం పరుపులపై ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ వాటిని మనం మన జీవితాలకు ముప్పు తెచ్చేవిగా మారిన వైరస్ లు, బాక్టీరియాల నుంచి మరింతగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్విస్ హైక్యూ వైరోబ్లాక్ సాంకేతికతతో శక్తివంతమైన డ్యూరో సేఫ్ యాంటీ వైరల్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అనేది భారతదేశం సురక్షితంగా ఉండేందుకు డ్యురోఫ్లెక్స్ అందిస్తున్న వాగ్దానం’’ అని అన్నారు.

Viro-block-A+ Mains

డ్యూరోఫ్లెక్స్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ రాజ్ జె. మాట్లాడుతూ, ‘‘100 శాతం మేడిన్ ఇండియా బ్రాండ్ గా మా లక్ష్యం ప్రతీ భారతీయ కుటుంబాన్ని డ్యూరోఫ్లెక్స్ డ్యూరో సేఫ్ ద్వారా సురక్షితంగా ఉంచడం. ఎంతో ఆలోచించే మా మ్యాట్రెసెస్ లలో గాకుండా మ్యాట్రెస్ ప్రొటెక్టర్ లో ఈహైక్యూ వైరోబ్లాక్ సాంకేతికతను అమర్చాలనే నిర్ణయాన్ని తీసుకున్నాం. తద్వారా ఈ పరిష్కారాన్ని మరెందరికో అందుబాటులోకి తీసుకువచ్చినట్లయింది.మా యాంటీవైరల్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ ను ప్రస్తుతం ఉన్న ఏ పరుపులపైనైనా ఉపయోగించవచ్చు. తద్వారా ఇదెంతో సరళమైన, సులభమైన జోడింపు పరిష్కారంగా మారింది’’ అని అన్నారు.

హైక్యూ వైరోబ్లాక్ సాంకేతికత గురించి హైక్యూ సహవ్యవస్థాపకుడు, సీఈఓ కార్లో సెంటోంజె మాట్లాడుతూ, ‘‘అత్యంత ప్రభావపూరిత, మన్నికైన, అధిక పనితీరు గల టెక్స్ టైల్ సాంకేతికతలను రూపొందించడం ద్వారా టెక్స్ టైల్ వినూత్నతలో హైక్యూ నాయకత్వ స్థానంలో ఉంది. హైక్యూలో మా నిపుణుల బృందం సౌఖ్యం, సురక్షితలపై ప్రధానంగా దృష్టిపెట్టేవి నూత్న ఉత్పాదనలను రూపొందించేందుకు గాను నిరంతరం పరిశోధన, అభివృద్ధితో ప్రమేయం కలిగిఉంటుంది. డ్యూ రోఫ్లెక్స్ తో కలసిపని చేయడం మాకెంతో ప్రత్యేకం. నిద్రించేందుకు ఉపయోగించే పరుపుల వంటి ఉత్పాదనల్లో మా వైరో బ్లా క్ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే మొదటిసారి’’ అని అన్నారు.

డ్యూరోఫ్లెక్స్ డ్యూరో సేఫ్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ యొక్క స్విస్ హైక్యూ వైరోబ్లాక్ సాంకేతికత అనేది ఎన్వలప్డ్ వైరస్ లు మరియు బాక్టీరియాలకు సంబంధించి ఐఎస్ఒ 18184 ప్రకారం ఒక పటిష్ఠమైన యాంటీవైరల్ గా మరియు ఐఎస్ఒ 20743 ప్రకారం ఒక పటిష్ఠమైన యాంటీబాక్టీరియల్ గా పరీక్షించబడింది. ఇందులో ఉపయోగించినవన్నీ కాస్మటిక్ గ్రేడ్, బయో ఆధారితం (72% బయో ఆధారిత కార్బన్), రీసైక్లిడ్ వే కావడంతో ఇది సురక్షితమైన మరియు సుస్థిరదాయకమైందిగా ధ్రువీకరించ బడింది. ఇది ఈయూ రీచ్, యూఎస్ ఫిఫ్రా కాంప్లియెంట్ కూడా. ఒయికోటెక్స్ చే ధ్రువీకరించబడింది. దీని యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ సర్ఫేస్ లకు యూఎస్ ఎఫ్ డిఎ ఆమోదం పొందింది. కోవిడ్ -19 కు కారణమయ్యే వైరస్సార్స్ సిఒవి-2 ను 99.99 శాతం తొలగిస్తుందని పరీక్షించబడింది.

డ్యూరో సేఫ్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ ప్రతీ ఒక్కరి పరుపుల అవసరాలకు తగినట్లుగా నాలుగు సైజుల్లో లభ్యమవుతుంది. సింగిల్, డబుల్, క్వీన్, కింగ్. సింగిల్ సైజ్ వెల రూ.2099 లతో ప్రారంభమవుతుంది. ఈ యాంటీ వైరల్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ దేశ వ్యాప్తంగా అన్ని డ్యూరోఫ్లెక్స్ రిటైల్ అవుట్ లెట్స్ లో లభ్యమవుతుంది. ఈ బ్రాండ్ వెబ్ సైట్ www.duroflexworld.comపై ఆన్ లైన్ లో కూడా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ పోర్టల్స్ లో కూడా లభ్యమవుతుంది. హెల్త్, మెడికల్ అవుట్ లెట్స్ లలో కూడా ఈ యాంటీ వైరల్ ప్రొటెక్టర్స్ లభ్యమయ్యేలా చేస్తోంది డ్యూరోఫ్లెక్స్ (@duroflexworld).

Please find below the Youtube link to the new Duro Safe Mattress Protector video:

డ్యురోఫ్లెక్స్ గురించి:

డ్యురోఫ్లెక్స్ భారతదేశ అగ్రగామి స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ లో ఒకటి. ఇది విస్తృతశ్రేణిలోప్రీమియం మ్యాట్రెసెస్ లను, స్లీప్ యాక్సెసరీస్ లను అందిస్తోంది. ఈ విప్లవాత్మక బ్రాండ్ ఐదు దశాబ్దాల నైపుణ్యం మరియు అత్యాధునిక సాంకేతికతలతో నాణ్యమైన నిద్రను పునర్ నిర్వచిస్తోంది. భారతదేశంలోనే మొదటివిగా చెప్పబడే వినూత్న, అత్యంత అధునాతన ఉత్పాదనలతో డ్యురోఫ్లెక్స్ అనేది పరిశ్రమలోనే లీడర్ గా విశిష్టతతో ఉంటోంది. దీని సిగ్నేచర్ శ్రేణి డ్యూరోపెడిక్ భారతదేశ మొట్టమొదటి మరియు ఏకైక ధ్రువీకృత ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ శ్రేణి. ఈ బ్రాండ్ నేడు నాణ్యత, వినూత్నత, సౌఖ్యంలకు మారుపేరుగా నిలిచింది. పటిష్ఠమైన సాంకేతికత, ఆధునిక ఉఫకరణాలు, భవిష్యత్ అవసరాలను అర్థం చేసుకునే శక్తిసామర్థ్యాలతో దీని ఉత్పాదన పోర్ట్ ఫోలియో ఉంది.