అధునాతన సీలింగ్ లైట్ ఎల్ఈడీ ప్యానెల్ ను ఆవిష్కరించిన క్రాంప్టన్ అత్యంత స్టయిల్ తో గరిష్ఠ ప్రకాశం కోసం స్టార్ లార్డ్

లైటింగ్ విభాగంలో భారతదేశ అగ్రగామి కంపెనీ అయిన క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏళ్లుగా ఎల్ఈడీ విభాగంలో వినూత్న లైటింగ్ ఉత్పత్తులతో ముందుకు సాగుతోంది. కంపెనీ ఇప్పుడు తన తాజా సీలింగ్ లైట్స్ – స్టార్ లార్డ్  శ్రేణితో ఈ వినూత్నతన మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తోంది. ఇవి అధిక ప్రకాశాన్ని అందిస్తాయి మరియు చూసేందుకు స్టయిలిష్ అల్ట్రా స్లిమ్ రిమ్స్ తో ఉంటాయి.స్లీకర్ సీలింగ్, బ్రైటర్ ఇలుమినేషన్ మరియు ఎన్నో ప్రయోజనాల కోసం తన నైపుణ్యవంతమైన డిజైన్ మార్గదర్శకత్వాన్ని సంస్థ అందిస్తోంది. కంపెనీ తన వినియోగదారులకు గరిష్ఠ స్టైల్ తో గరిష్ఠ ప్రకాశాన్ని అందించేందుకు తాజా ఉత్పత్తులు వీలు కల్పిస్తాయి.

మన జీవితంలో లైటింగ్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మనం నివసించే చోట స్పేస్ ను అది అధికం చేస్తుంది. మూడ్ ను, వాతావరణాన్ని పూర్తిగా పరివర్తింపజేస్తుంది. ఎల్ ఈడీ పై ఉన్న దృక్పథంలో మార్పు కూడా మార్పు వచ్చింది. సాధారణ ప్రకాశం అవసరం ఇప్పుడు మ రింత మెరుగుపడింది. ఇంటి అలంకరణలో భాగమైంది. ఎల్ ఈడీ ప్యానెల్స్ ఇప్పుడు ప్రకా శాన్ని ఫాల్స్ సీలింగ్స్ లో డిజైన్ టచ్ తో అందిస్తున్నాయి. అది గదికి మరింత స్టయిల్ ను జోడిస్తుంది. మరింత ప్రకాశాన్నీ అందిస్తుంది. గది కాంతివంతంగా ఉండేందుకు కొనుగోలుదారులు ఎల్లప్పు డూ గరిష్ఠ ప్రకాశం కోసం చూస్తుంటారు. సరైన బల్బులను ఎంచుకోవడంలో వారు మరింతగా నిమగ్నమవుతున్న కొద్దీ అల్ట్రా మోడర్న్ గా ఉంటూ తగినంత ప్రకాశత్వాన్ని అందించే వాటిని లేదా గది నాలుగువైపులా సమానంగా ప్రకాశాన్ని అందించగలిగే వాటినీ కనుక్కోవడం కష్టమవుతుంటుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కీలక అవసరాలను తీర్చేలా క్రాంప్టన్ యొక్క స్టార్ లార్డ్ 100 లుమెన్స్ పర్ వాట్ తో అల్ట్రా స్లిమ్ ఎల్ఈడీ ప్యానెల్స్ శ్రేణిని అందిస్తోంది. ఇవి శక్తిని ఆదా చేయడం మాత్రమే గాకుండా అధిక ప్రకాశాన్ని, దాంతో పాటు మరింత స్టయిల్ ను కూడా అందిస్తాయి.

ఈ సందర్భంగా క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లైటింగ్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ కౌల్ మాట్లాడుతూ, ‘‘ ఇంటి పునరుద్ధరణ మొదలుకొని ఇంటిని అలంకరించడం దాకా స్టార్ లార్డ్ మీరు ఉండే స్థలాన్ని ఏకరీతిన ప్రకాశవంతం చేస్తూ మీరు చేసే పనులను మరింత సులభంగా, నిర్మాణాత్మకంగా చేసే వీలును కల్పిస్తుంది. కాంతికి సంబంధించి గొప్ప పనితీరు, స్టయిల్ కి సంబంధించి గొప్ప డిజైన్ గా ఇది ఉంటుంది. దీని కీలక విశిష్టతలేవీ కూడా ప్రాథమిక కాంతి, వ్యయం, శక్తి ఆదా అవసరాలపై రాజీపడలేదు. సౌఖ్యాన్ని, సౌలభ్యాన్ని, స్టయిల్ ను జోడించడాన్ని క్రాంప్టన్ విశ్వసిస్తుంది. వీటన్నిటికీ వినూత్నత వెన్నుదన్నుగా ఉంటోంది. మా నూతన ఉత్పాదన స్టార్ లార్డ్ ఈ విశిష్టతలను అందించేలా మరియు మీ ఇంటిని సంతోషదాయక ప్రాంతంగా చేసేలా డిజైన్ చేయబడింది’’ అని అన్నారు.

క్రాంప్టన్ యొక్క స్టార్ లార్డ్ అనేది 100 లుమెన్ పర్ వాటేజ్  లుమెన్ సామర్థ్యాన్ని కలిగిఉంది. ఇతర ప్యానెల్స్ తో పోలిస్తే మరింత ప్రకాశత్వాన్ని అందిస్తుంది. కాంతి పడే స్థలాన్ని అధికం చేస్తుంది. దీని అల్ట్రా స్లిమ్ రిమ్ తో స్లీకర్ డిజైన్ సాధ్యపడింది. అది మరింత స్టయిల్ నిచ్చేలా ఫాల్స్ సీలింగ్ తో మిళితం అవుతుంది. ఈ శ్రేణి రౌండ్ మరియు స్క్వేర్ ప్రామాణిక ఆకారాల్లో లభ్యమవుతుంది. గదిని గరిష్ఠ ప్రకాశంతో మరియు గరిష్ఠ స్టయిల్ తో ఉంచగల విభిన్న కలర్ టెంపరేచర్ వేరియంట్స్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.  బ్రైట్ వైట్ గ్లో కలిగిఉండే కూల్ డే లైట్ కలర్ (6500కె) నుంచి నేచురల్ లైట్ తో ఉండే (4000కె) దాకా ఇవి సహజంగా మారుతూ ఉండే సూర్య కాంతి యొక్క అందమైన ప్రకాశత్వాన్ని అందిస్తాయి. వార్మ్ వైట్ (3000కె) అనేది వార్మ్, కోజీ వాతావరణాలకు అనువైంది. ఇళ్లు, కార్యాలయాలు, ఆడిటోరియంలు, కమర్షియల్ ఇంటీరియర్ ప్లేసెస్ లో వీటిని వాడవచ్చు.

గరిష్ట ప్రకాశం కోసం మరియు గరిష్ఠ స్టయిల్ కోసం చూసే వినియోగదారులకు ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాంటింది. దిగువ సుసంపన్న ఫీచర్లతో, ప్రయోజనాలతో నూతన స్టార్ లార్డ్ తనదైన శ్రేణిని ప్రవేశపెడుతోంది.

  • గరిష్ట ప్రకాశం కోసం వాటేజ్ కాంతికి 100 ల్యూమన్ ల మేరకు ల్యూమన్ సమర్థత
  • అల్ట్రా స్లిమ్ రిమ్. ఇది గరిష్ట స్టయిల్ కోసం ఫాల్స్ సీలింగ్‌తో మిళితం అవుతుంది, స్లీకర్ డిజైన్‌గా మారుతుంది.
  • పరిమాణాలు ప్రామాణికంగా ఉన్నాయని నిర్ధారిస్తూ రైట్ కటౌట్ సైజుతో వస్తుంది. ఇది ఎలక్ట్రీషియన్లకు వ్యవస్థాపనను ఇబ్బంది లేని ప్రక్రియ గా చేస్తుంది.
  • అధిక శక్తి కారకం> 0.9 తో స్టార్ లార్డ్ విద్యుత్ నష్టాలను తగ్గిస్తుంది మరియు ప్యానెల్స్ జీవితాన్ని పెంచుతుంది
  • వైడర్ బీమ్ యాంగిల్‌తో కలసి అంతటా కాంతి ఒకే విధంగా వ్యాపించిందని మిల్కీ వైట్ డిఫ్యూజర్నిర్ధారిస్తుంది.లైట్ అవుట్ పుట్ఆ ప్రదేశం యొక్క అన్ని మూలలకు ఏకరీతిగా కాంతి చేరుకునేందుకు వీలు కల్పిస్తుంది.
  • ఈ ఉత్పాదనల ధరల శ్రేణి:
ఉత్పత్తి రకంగరిష్ఠ చిల్లర ధర
5W – CDL/NW/WW400
10W – CDL/NW/WW600
12W – CDL/NW/WW700
15W – CDL/NW/WW800
20W – CDL/NW/WW1200

క్రాంప్టన్ గురించి:

75+ ఏళ్ళ బ్రాండ్ వారసత్వంతో, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది ఫ్యాన్లలో భారతదేశ అగ్రగామి సంస్థల్లో ఒకటి. ఏళ్ళుగా ఈ సంస్థ ఆధునిక వినియోగదారు అవసరాలను తీర్చే వినూత్న వస్తువు లను విస్తృత శ్రేణిలో అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. యాంటీ డస్ట్ ఫ్యాన్స్, యాంటీ బాక్టీరియల్ ఎల్ఈడీ బల్బు లతో పాటుగా ఇతర శ్రేణులకు చెందిన వాటర్ హీటర్లు, ఎయిర్ కూలర్లు, మిక్సర్ గ్రైండర్స్ లాంటి ఫుడ్ ప్రాసెసర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్, ఇస్త్రీ పెట్టె లాంటివి వీటిలో ఉన్నాయి.బ్రాండ్ మరియు వినూత్నతలో కంపెనీ మరింతగా ఇన్వెస్ట్ చేస్తోంది. వినూత్నత అనేది వినియోగదారుల అవసరాలను తీర్చడం మాత్రమే గాకుండా అది శక్తి ఆదాను పెంచేదిగా కూడా ఉంటోంది. శక్తిసామర్థ్య ఉత్పాదనలను అభివృద్ధి చేసే దిశలో నిరంతరం పని చేస్తున్న కంపెనీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లియెన్సెస్ ఆఫ్ ది ఇయర్ 2019లో నేషనల్ ఎనర్జీ కన్జ్యూమర్ అవార్డ్స్ (ఎన్ఈసీఏ) ను గెలుపొందింది. సీలింగ్ ఫ్యాన్లలో దీని హెచ్ ఎస్ ప్లస్ మోడల్ కు మరియు ఎల్ఈడీ బల్బ్ విభాగంలో దీని తొమ్మిది వాట్ల ఎల్ఈడీ బల్బ్ కు ఈ అవార్డులు లభించా యి. డబ్ల్యూపీపీ అండ్ కంటార్ విడుదల చేసిన బ్రాండ్స్ టాప్ 75 మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్స్ లిస్ట్ (2020)లో ఈ కంపెనీ స్థానం సంపాదించింది. ఈ కన్జ్యూమర్ బిజినెస్ సంస్థ దేశవ్యాప్తంగా పటిష్ఠ డీలర్ వ్యవస్థతో విస్తృత సర్వీస్ నెట్ వర్క్ కలిగి స మర్థంగా విక్రయానంతర సేవలను వినియోగదారులకు అందించగలుగుతోంది.