మీ విద్యుత్ బిల్లుపై 50% ఆదా చేసుకోండి

సీలింగ్ ఫ్యాన్ విభాగంలో భారతదేశ అగ్రగామి అయిన క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రిక ల్స్ లిమిటెడ్ తన నూతన ఫ్యాన్ల శ్రేణిని తన ఉత్పాదనల పోర్ట్ ఫోలియోకు జోడించింది. నూతన అధునాతన ఫ్యాన్ల శ్రేణి – ఎనర్జియన్ ను ఆవిష్కరించింది. ఇది యాక్టివ్ బీడీఎల్ సీ టెక్నాలజీ తో శక్తివంతమైన సీలింగ్ ఫ్యా న్ల శ్రేణి. దీంతో వీటిని వాడే వారు విద్యుత్ బిల్లుపై 50% ఆదా చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది 70 వాట్స్ కు బదులుగా 35 వాట్స్ విద్యుత్ నే ఉపయోగిస్తుంది. సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే, ఎనర్జియన్ అందించే ఓల్టేజ్ తేడా అధిక స్థాయిలో శక్తి ఆదాకు మరియు అత్యధిక సామర్థ్య పనితీరుకు వీలు కల్పిస్తుంది.

ఉష్ణ మండల దేశంగా భారతదేశం, ఉష్ణోగ్రతలు అధికమైనప్పుడు తీవ్రమైన ఎండాకాలాల్ని ఎదుర్కొంటుంది. ఇ లాంటి సందర్భాల్లో భారతీయ ఇళ్లలో అత్యంత సాధారణంగా ఉపయోగించే వస్తువైన ఫ్యాన్ 24×7 గా పని చే స్తుంటుంది. దాంతో, ఇంట్లో ఉండే ఫ్యాన్లు, అవి పని చేసే గంటలు అన్నీ కలసి విద్యుత్ బిల్లును గణనీయంగా పెం చుతాయి. వినియోగదారులు కోరుకునే మార్పులతో పాటుగా శక్తి ఆదాను దృష్టిలో ఉంచుకొని క్రాంప్టన్ తన సరి కొత్త బీఎల్ డీసీ శ్రేణి ఫ్యాన్లను ఎనర్జియన్ పేరిట ఆవిష్కరించింది. ఇవి విద్యుత్ వినియోగాన్ని చేయడం మాత్ర మే గాకుండా విద్యుత్ ఆదాను గరిష్ఠం చేస్తాయి.

తాజా వినూత్నతపై క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రిక ల్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రంగరాజన్ శ్రీరామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘సాంకేతికతల్లో అధునాతనలు మరియు ధోరణుల్లో మార్పులు అనేవి ఈ విభా గంలో నిరంతరం చోటు చేసుకుంటూనే ఉన్నాయనే విషయాన్ని ఇన్నేళ్లుగా మేము గుర్తిస్తూ వచ్చాం. ఈ రోజున శీతోష్ణస్థితి మార్పులు మరియు పర్యావరణంపై ప్రభావం అనేవి మనకు ఆందోళన కలిగించే అతిపెద్ద అంశాలుగా ఉన్నాయి. దీంతో వినియోగదారులు మరింత అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కల్పించడం మరియు సౌకర్యాలతో రాజీ పడకుండానే శక్తి ఆదా ఉపకరణాలను కొనుగోలు చేసేందుకు వీలైన పరిష్కారాలను రూపొందించడం అవసరమని ఒక సంస్థగా మేం భావించాం. ఈ నూతన ఆవిష్కరణతో వినియోగదారులు అటు వ్యయాలను ఇటు విద్యుత్ ను ఆదా చేయగలుగుతారని మరియు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా వేసవి కాలాలను ఆనందిస్తారని మేము విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

క్రాంప్టన్ ఎనర్జియన్ ఫ్యాన్లు యాక్టివ్ బీఎల్ డీసీ సాంకేతికతను వినియోగిస్తాయి. ఏటా ఒక్కో ఫ్యాన్ పై మీరు ఏటా రూ.1500 వరకు లేదా సగటున ఒక ఇంటిలో 4 ఫ్యాన్లకు గాను రూ.6000 దాకా ఆదా చేయగలుగు తా రు. శక్తి ఆదా ఎంతో ముఖ్యం. అందుకే క్రాంప్టన్ యాక్టివ్ బీఎల్ డీసీ మోటార్ టెక్నాలజీ 90V నుంచి 300V దాకా వోల్టేజీ శ్రేణితో 98%పవర్ ఫ్యాక్టర్ ను కలిగిఉంటుంది. అధిక స్పీడ్ కు ఇది వీలు కల్పిస్తుంది. బీ ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఫ్యాన్ స్మార్ట్ రిమోట్ తో కూడా లభిస్తుంది. అది ఆర్ఎఫ్ సాంకేతికతను ఉపయోగిస్తుం ది. దాంతో మీరు రిమోట్ ను ఫ్యాన్ వైపు పెట్టకుండా కూడా ఆపరేట్ చేసేందుకు ఈ సాంకేతికత వీలు కల్పి స్తుంది. వినూత్నత మరియు అందం పరిపూర్ణ మేళవింపుతో పాటుగా ఈ ఫ్యాన్లు 5 ఏళ్ల వారంటీని కూడా అందిస్తాయి. విశిష్టమైన అందమైన డిజైన్లలో లభ్యమవుతాయి. వినియోగదారులను తమ సీలింగ్ ఫ్యాన్లను శుభ్రం చేయడంలో ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యాంటీ డస్ట్ ఫీచర్ ను కూడా అందిస్తోంది. క్రాంప్టన్ ఎనర్జియన్ మూడు రకాల్లో లభ్యమవుతుంది. ఎనర్జియన్ హెచ్ఎస్, ఎనర్జియన్ జురా, ఎనర్జియన్ అ వురా వీటిలో ఉన్నాయి. వీటి ధరలు రూ. 2800 నుంచి రూ. 4000 దాకా ఉంటాయి.

క్రాంప్టన్ గురించి:

75+ ఏళ్ళ బ్రాండ్ వారసత్వంతో, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది ఫ్యాన్లలో భారతదేశ అగ్ర గామి సంస్థల్లో ఒకటి. ఏళ్ళుగా ఈ సంస్థ ఆధునిక వినియోగదారు అవసరాలను తీర్చే వినూత్న వస్తువులను విస్తృత శ్రేణిలో అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. యాంటీ డస్ట్ ఫ్యాన్స్, యాంటీ బాక్టీరియల్ ఎల్ఈడీ బల్బు లు, వాటర్ హీటర్లు, ఎయిర్ కూలర్లు, మిక్సర్ గ్రైండర్స్ లాంటివి వీటిలో ఉన్నాయి. శక్తిసామర్థ్య ఉత్పాదనలను అభివృద్ధి చేసే దిశలో నిరంతరం పని చేస్తున్న కంపెనీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లియెన్సెస్ ఆఫ్ ది ఇయర్ 2019లో నేషనల్ ఎనర్జీ కన్జ్యూమర్ అవార్డ్స్ (ఎన్ఈసీఏ) ను గెలుపొందింది. సీలింగ్ ఫ్యాన్లలో దీని హెచ్ ఎస్ ప్లస్ మోడల్ కు మరియు ఎల్ఈడీ బల్బ్ విభాగంలో దీని తొమ్మిది వాట్ల ఎల్ఈడీ బల్బ్ కు ఈ అవార్డులు లభించా యి. ఈ కన్జ్యూమర్ బిజినెస్ సంస్థ దేశవ్యాప్తంగా పటిష్ఠ డీలర్ వ్యవస్థతో విస్తృత సర్వీస్ నెట్ వర్క్ కలిగి స మర్థంగా విక్రయానంతర సేవలను వినియోగదారులకు అందించగలుగుతోంది.