ఆశ్చర్యపోకండి….ఆమె బిర్లా గారి అమ్మాయే !

కుమార మంగళం బిర్లా.. భారతీయ బిజినెస్ ప్రపచంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న ఈయనకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తన వారసులకు ఆస్దిని అయితే ఇవ్వగలుగుతారు కానీ ..తనకున్న పేరు ,ప్రతిష్టలను ట్రాన్సఫర్ చేయలేరు కదా..అవి ఎవరికి వాళ్ళే కష్టపడి సంపాదించుకోవాలి. ఈ విషయం అనన్య బిర్లాకు బాగా తెలుసు. అందుకే ఆమె కేవలం తనను బిర్లా వారసురాలిగా కాకండా  ప్రపంచం తనను అనన్య బిర్లా గా గుర్తించుకోవాలనుకుంది. అందుకోసం ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలి. అదే చేసింది అనన్య బిర్లా. అందుకే ఈ రోజు ప్రపచం ఆమె గురించి మాట్లాడుకుంటోంది.    వ్యాపారంలోనూ, ఇటు సంగీతంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళ్తోంది. బిర్లాల వంశంలో ఐదో తరానికి ప్రాతినిథ్యం వహిస్తూ పాప్‌స్టార్‌గా వెలుగొందుతున్న అనన్య బిర్లా…  అనన్యమైన ఆశయాలతో ముందుకు సాగిపోతూ…తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటం అందిరికీ స్పూర్తిగా నిలుస్తోంది. అసామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఆమె సామాన్యమైన వ్యక్తిలా కష్టపడటం చూసి ముక్కున వేలేసుకుంటోంది. 
 స్టాక్, వెంచర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రుణాలు అందజేసి గ్రామీణ స్థాయిలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సంస్థ సబ్సిడీపై మహిళలకు రుణాలు అందజేస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు ఇచ్చిన రుణాలపై మైక్రో ఫైనాన్స్ కంపెనీలు భారీ స్థాయిలో వడ్డీ రేట్లు అమలు చేయడం, తద్వారా వివాదాలు చెలరేగడం తదితర అంశాల పట్ల ఆమె సమగ్రంగా అధ్యయనం చేసి అవినీతి లేని మైక్రో ఫైనాన్స్ వ్యాపారాన్ని సమర్దవంతంగా ముందుకు తీసుకెల్తున్నారు.
తల్లితో కలిసి ఎంపవర్ మైండ్స్ అనే సంస్థను స్థాపించి,  మానసిక అనారోగ్యంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు.   మహిళలు రూపొందించే హస్తకళలను ప్రోత్సహించే లక్ష్యంతో క్యూరోకార్ట్ పేరుతో వెంచర్‌ను ప్రారంభించారు. 
పాప్ స్టార్ గా..
అనన్య బిర్లా లండన్లో ఉన్నపుడే సంగీతానికి దగ్గరై…. అక్కడే గిటార్ ప్లే చేయడం నేర్చుకున్నారు. దానికి ఆమె తీయని గొంతు కూడా తోడై అద్బుతాల ఆవిష్కరణకు దారి తీసింది.   ఓ వైపు వ్యాపారం, మరోవైపు సంగీతం.. ఏది ముఖ్యం అనే సందిగ్ధం లేకుండా… ఆక్స్‌ఫర్డ్ నుంచి ఇండియాకు తిరిగి రాగానే ఒక టీమ్‌ను తయారు చేసుకుంది. లివిన్ ది లైఫ్ పేరుతో తొలి మ్యూజిక్ వీడియోను యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా ద్వారా రిలీజ్ చేసింది. ఆ ఆల్బమ్ ఆమెకు మంచిపేరు తెచ్చింది.